ప్రముఖ బ్యాట్స్‌మెన్, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవిత కథ వెండితెర దృశ్యమానం కానుంది. టైటిల్ రోల్‌ను బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా పోషించబోతున్నారు. ఈ చిత్రానికి ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించనున్నారు. డిసెంబర్లో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది. భారత క్రికెట్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన సారథిగా గంగూలీ పేరు తెచ్చుకున్నారు.
తనదైన డాషింగ్ నేచర్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఈ సినిమా కోసం ఆయుష్మాన్ ఖురానా రెండు నెలల పాటు క్రికెట్ కోచింగ్ తీసుకోబోతున్నాడని తెలిసింది. స్వతహాగా లెఫ్ట్‌హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్ అయిన ఆయుష్మాన్ ఖురానా.. గంగూలీ తరహా క్రికెటింగ్ షాట్స్‌ను సాధన చేయబోతున్నారని తెలిసింది. ఈ సినిమా విషయంలో చిత్రబృందం ఇటీవల సౌరవ్ గంగూలీని కలుసుకొని ఆయన అనుమతి తీసుకున్నట్లు సమాచారం. లవ్ రంజన్, అంకుర్ గార్గ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.