హ్యారీపాటర్ నటుడు రాబీ కొల్ట్రేన్ కన్నుమూత
హ్యారీపాటర్ సినిమాల్లో హాగ్రిడ్గా నటించిన స్కాట్లాండ్ నటుడు రాబీ కొల్ట్రేన్ మరణించారు. 72 ఏండ్ల వయసులో శుక్రవారం రాబీ కొల్ట్రేన్ తుదిశ్వాస విడిచారు.
న్యూయార్క్ : హ్యారీపాటర్ సినిమాల్లో హాగ్రిడ్గా నటించిన స్కాట్లాండ్ నటుడు రాబీ కొల్ట్రేన్ మరణించారు. 72 ఏండ్ల వయసులో శుక్రవారం రాబీ కొల్ట్రేన్ తుదిశ్వాస విడిచారు. ఐటీవీ డిటెక్టివ్ డ్రామా క్రాకర్‌తో పాటు గోల్డెన్‌ఐ, ది వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్ వంటి జేమ్స్ బాండ్ సినిమాల్లో ఆయన కనిపించినా హ్యారీపాటర్ ఫిల్మ్స్‌తోనే ఎక్కువ గుర్తింపు పొందారు.
డేనియల్ రాడ్‌క్లిఫ్, ఎమ్మా వాట్సన్, రూపర్ట్ గ్రింట్ వంటి వారితో కలిసి హ్యారిపాటర్ సిరీస్‌లో రాబీ కొల్ట్రేన్ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రాబీ మరణం పట్ల పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు.
రాబీ కోల్ట్రెన్ అసాధారణ నైపుణ్యాలు కలిగిన వారని, ఆయన మరణం అత్యంత బాధాకరమని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని హ్యారీపాటర్ రచయిత్రి జేకే రౌలింగ్ ట్వీట్ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

