Ileana: పెళ్లి చేసుకోవాలని ఉన్నా, ఇలియానాకి వరుడు దొరకట్లేదట..!

గోవా బ్యూటీ ఇలియా(ileana)నా అందచందాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈ అమ్మడు ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ తెగ సందడి చేసింది. మోడల్‌గా ఫేమస్ అయిన టైంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. ఆరంభంలోనే అద్భుతమైన నటనతో పాటు అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్గా అవతారమెత్తింది.
బాలీవుడ్‌లోను పలు సినిమాలు చేసిన ఇలియానా కొద్ది నెలలక్రితం అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఇలియానాకి పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం ఫొటో షూట్స్‌తో పిచ్చెక్కిస్తుంది ఇలియానా. 35 ఏళ్ల వయస్సు ఉన్న ఇలియానా ఆ మధ్య గర్భవతి కూడా అని ఓ వార్త తెగ వైరల్ అయింది. తన బాయ్ ఫ్రెండ్ తో ఇలియానా రహస్య వివాహం చేసుకుందని.. దాని ఫలితంగా ఆమె గర్భం కూడా దాల్చింది అని పుకార్లు పుట్టించారు.
తాజాగా ఓ నెటిజన్.. ఇలియానా పెళ్లి గురించి ప్రశ్నించగా, ఈ అమ్మడు చాలా కూల్‌గా సమాధానం ఇచ్చింది. పెళ్లి ఆలోచన ఉంది, కానీ వరుడు దొరకాలి కదా’ అంటూ చెప్పుకొచ్చింది. అంటే ఇలియానాకి కరెక్ట్ పర్సన్ దొరికితే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందన్నమాట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ileana
- Telugu News
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

