Anasuya fires at fans | టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ కొందరు యువకులకు అసభ్య కామెంట్లు చేస్తే చెప్పు తెగుద్ది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కపూరంలోని ఓ షాపింగ్‌మాల్ ఓపెనింగ్‌లో భాగంగా అక్కడికి వెళ్లిన అనసూయని కొందరు ఆకతాయిలు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. దీంతో అనసూయ వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. చెప్పు తెగుద్ది.. మీ ఇంట్లో అమ్మ, చెల్లి, భార్య కుటుంబసభ్యులను ఇలాగే కామెంట్లు చేస్తే ఊరుకుంటారా. పెద్దవాళ్లకి మర్యాద ఇవ్వడం మీ ఇంట్లో నేర్పలేదా అంటూ అనసూయ ఆగ్రహాం వ్యక్తం చేసింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అసభ్య కామెంట్లు చేస్తే చెప్పు తెగుద్ది
:- #Anasuya pic.twitter.com/nQZHOUScXR
— Milagro Movies (@MilagroMovies) August 2, 2025