SS Rajamouli | డేవిడ్ వార్నర్‌తో ఎస్ఎస్ రాజమౌళి సినిమా తీస్తే.. ఫన్నీగా CRED యాడ్
David Warner | స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) ఓ క్రికెటర్‌తో సినిమా చేస్తే ఎలా ఉంటుంది. ఊహించడానికి కొత్తగా ఉన్నా ఇది మాత్రం నిజం. మరి జక్కన్న డైరెక్ట్ చేసింది ఏ క్రికెటర్‌ననే కదా మీ డౌటు.
SS Rajamouli | బాహుబలి ప్రాంఛైజీ, ఆర్ఆర్ఆర్ సినిమాలతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli). ఈ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఈ దిగ్గజ దర్శకుడు ఓ క్రికెటర్‌తో సినిమా చేస్తే ఎలా ఉంటుంది. ఊహించడానికి కొత్తగా ఉన్నా ఇది మాత్రం నిజం. మరి జక్కన్న డైరెక్ట్ చేసింది ఏ క్రికెటర్‌ననే కదా మీ డౌటు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఫన్ వీడియోతో వినోదాన్ని అందించే పాపులర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner).
డేవిడ్ వార్నర్‌కు ఫోన్ చేసిన జక్కన్న.. మీ మ్యాచ్ టికెట్స్ పై నాకేమైనా డిస్కౌంట్ ఇస్తారా.. అని అడిగాడు. దీనికి డేవిడ్ వార్నర్ స్పందిస్తూ.. రాజా సార్ ఒకవేళ మీరు క్రెడ్ CRED UPI (క్రిడిట్ కార్డు చెల్లింపుల యాప్) కలిగి ఉంటే క్యాష్ బ్యాక్ పొందొచ్చంటున్నాడు. అయితే తనకు సాధారణ యూపీఐ మాత్రమే ఉంటే అని జక్కన్న అడుగగా.. డిస్కౌంట్ కావాలంటే మీరు నాతో సినిమా తీయాలని కోరుతాడు డేవిడ్ వార్నర్. అతని విజ్ఞప్తి మేరకు వార్నర్‌తో సినిమా మొదలుపెడతాడు జక్కన్న. వార్నర్‌తో జక్కన్న ఓ సీన్‌తోపాటు యాక్షన్ పార్టు, సాంగ్ షూట్ పూర్తి చేస్తాడు.
అనంతరం మనం ఆస్కార్స్‌లో కలుద్దామని జక్కన్నతో అంటాడు వార్నర్. ఇక వార్నర్‌తో సినిమా తీయడంపై విసుగొచ్చిన జక్కన్న.. అతడితో సినిమా చేయడం కంటే అప్‌గ్రేడ్ అవడం ఉత్తమమని ఫిక్స్ అవుతాడు. ఇక వార్నర్ ఫోన్ చేస్తే తాను ఇప్పుడే CRED UPI కి అప్‌గ్రేడ్ అయ్యాయని చెప్తాడు. డేవిడ్ వార్నర్-జక్కన్న స్టైల్లో సాగుతున్న నయా యాడ్ ఇప్పుడు ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది.
CRED యాడ్..
#SSRajamouli – #DavidWarner 😁😁
— Vamsi Kaka (@vamsikaka) April 12, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ T20I | న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

