Junaid Shaikh | సమంత అథ్లెట్ అయితే కోహ్లీలా ఉండేది: ట్రైనర్ జునైద్
స్క్వాట్స్, ఏరోబిక్స్, ఏరియల్ యోగా..ఎలాంటి వర్కవుట్ అయినా అవలీలగా చేసి పడేయడం సామ్‌కు వెన్నతో పెట్టిన విద్య. అయితే సమంత ట్రైనర్ జునైద్ షేఖ్ (Junaid Shaikh) ఆమెకు ఎప్పుడూ ఒక్కటే చెబుతాడట.
ఫిట్నెస్ (fitness) మెయింటైన్ చేసే విషయంలో అందరికంటే ముందుంటుంది స్టార్ హీరోయిన్ సమంత (Samantha). సన్నగా, నాజూకుగా కనిపించే ఈ భామ కష్టతరమైన వర్కవుట్స్ కూడా ఏ మాత్రం భయపడకుండా చేస్తోంది. స్క్వాట్స్, ఏరోబిక్స్, ఏరియల్ యోగా..ఎలాంటి వర్కవుట్ అయినా అవలీలగా చేసి పడేయడం సామ్‌కు వెన్నతో పెట్టిన విద్య. అయితే సమంత ట్రైనర్ జునైద్ షేఖ్ (Junaid Shaikh) ఆమెకు ఎప్పుడూ ఒక్కటే చెబుతాడట. ఒకవేళ సమంత అథ్లెట్ (క్రీడాకారులు) అయితే విరాట్ కోహ్లీ (Virat Kohli)లా ఉండేదని చెబుతుంటానని చెప్పాడు.
సమంత ఎప్పుడైనా ఒక్కటే చెబుతుంది. నేను ప్రయత్నిస్తా..మరొక్కసారి చెయ్యి. సామ్ చాలా దూకుడుగా ఉంటుంది. కష్టమైన పనులు కూడా చేయాలనుకుంటుంది. ఆమెను చూసి నేను స్పూర్తిని పొందుతా. ఈ చెన్నై సుందరి ప్రతీ రోజు ఉదయాన్నే నిద్రలేచి వర్కవుట్స్ పూర్తి చేస్తుందన్నాడు. అంతేకాదు పుష్ప సినిమాలో వచ్చే ఊ అంటావా మావ ఊఊ అంటావా పాట ప్రిపరేషన్ కోసం చాలా వర్కవుట్ చేసిందని చెప్పుకొచ్చాడు జునైద్.
సామ్ ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాతువాకుల రెండు కాధల్ సినిమాలో నటిస్తోంది. గుణశేఖర్ డైరెక్షన్లో సామ్ చేస్తున్న శాకుంతలం షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతోపాటు మరో ఫీ మేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టు యశోద సినిమాలో కూడా నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

