Salman Khan | సల్మాన్ లాంటి స్టార్ హీరో ఫోన్ చేస్తే బ్లాక్ చేస్తారా ఎవరైనా? కానీ ఆ పని చేశానని చెబుతున్నది బాలీవుడ్ యువతార షెహనాజ్ గిల్. అతని నెంబర్ అని తెలియక బ్లాక్ చేశానని చెప్పుకుందామె. సల్మాన్ నటించిన కొత్త సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’లో ఓ కీలక పాత్రలో నటించిందీ నాయిక. ఈ చిత్రంలో వెంకటేష్, పూజా హెగ్డే, భూమిక, జగపతి బాబు తదితరులు నటించారు. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కాబోతున్నది.
ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న షెహనాజ్ మాట్లాడుతూ…‘కాంటాక్ట్ లిస్టులో లేని నెంబర్స్ నుంచి ఫోన్ కాల్స్ వస్తే బ్లాక్ చేయడం నాకు అలవాటు. ఓ రోజు కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే బ్లాక్ చేశా. సల్మాన్ మీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ మరో మెసేజ్ వచ్చింది. దాంతో బ్లాక్ చేసిన నెంబర్‌ను అన్‌బ్లాక్ చేసి ట్రూకాలర్ యాప్‌లో చెక్ చేశా. అది నిజంగానే సల్మాన్ ఫోన్. అతనికి సారీ చెప్పి మాట్లాడాను. అలా ఈ చిత్రంలో అవకాశం వచ్చింది’ అని చెప్పింది.