China Piece | నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా చైనా పీస్. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేశ్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.
యూనిక్ కాన్సెప్ట్, ప్రజెంటేషన్, యాక్షన్, థ్రిల్, హ్యూమర్ ఎలిమెంట్స్‌తో వచ్చిన టీజర్ ఈ సినిమాపై అంచనాలను క్రియేట్ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఇదేంటో జేమ్స్‌బాండ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. కార్తిక్ రోడ్రిగ్జ్ ఈ సాంగ్‌ను ఎనర్జిటిక్‌గా కంపోజ్ చేశారు. స్ఫూర్తి జితేందర్, హారిక నారాయణ్ వోకల్స్ ఆకట్టుకున్నాయి. దినేశ్ కాకర్ల లిరిక్స్ కాన్సెప్ట్‌ను చాలా ఫన్ఫుల్గా ప్రజెంట్ చేశారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.