ఆరోజు కోసం వేచిచూస్తున్నా
‘విశ్వరూపం’ సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచితమైన తమిళ నాయిక ఆండ్రియా జెర్మియా. తెలుగులో ‘తఢాఖా’ అనే చిత్రంలోనూ నటించింది. కోలీవుడ్‌లో వరుస చిత్రాల్లో నటిస్తున్న ఈ తార గీత రచయితగా పరిచయం కాబోతున్నది. ఆమె తాజాగా ఫ్లేవర్స్ అనే మ్యూజిక్ ఆల్బమ్ తయారుచేసింది. తను రాసిన ఏడు పాటలు ఈ ఆల్బమ్‌లో ఉంటాయి. ప్రేమలో పడటం, ప్రేమ విఫలమై గాయపడటాన్ని ఈ పాటల నేపథ్యంగా తీసుకుంది ఆండ్రియా. సోషల్ మీడియాలో తనకు కనిపించే ప్రేమికుల స్పందనే ఈ పాటలు రాసేందుకు స్ఫూర్తిగా నిలిచిందని చెప్పింది.
ఆండ్రియా జెర్మియా మాట్లాడుతూ….‘పాటలు రాయడం నాకొక అలవాటు. లాక్డౌన్ టైమ్‌లో ప్రతి ఒక్కరూ సంగీతాన్ని ఆస్వాదించారు. అప్పటి ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఈ పాటల్లోని ఏడింటిని ఆల్బమ్ తయారు చేశాం. ప్రేమలో జయాపజయాలను ఇతివృత్తంగా ఎంచుకుని పాట రాశాను. సినిమా సంగీతంలా ప్రైవేట్ మ్యూజిక్కూ పేరొచ్చే రోజు కోసం వేచి చూస్తున్నా’ అని చెప్పింది. ప్రస్తుతం ‘కా’, ‘పిసాసు 2’, ‘మాలిగై’ వంటి చిత్రాల్లో నటిస్తున్న ఆండ్రియాకు పలు మ్యూజిక్ లేబుల్స్ నుంచి ఆల్బమ్స్ చేయమంటూ అవకాశాలు వస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ram Charan | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రామ్ చరణ్ – సుకుమార్ RC17 రిలీజ్ డేట్ ఫిక్స్?
Road Accident | దైవ దర్శనానికి వెళ్తూ యాక్సిడెంట్.. 13 మంది మృతి
Ramayana | సీత పాత్రపై విమర్శలు.. నెగిటివిటీపై లేడీ పవర్‌స్టార్ అదిరిపోయే సమాధానం!
IND vs NZ | బుమ్రా దెబ్బకు లాథమ్ ఔట్.. టీ బ్రేక్‌కు కివీస్ స్కోర్ ఇదే
Bigg Boss 10 | వర్షిణి కన్నీళ్లు.. అమన్, ముఖేష్‌లకు నాగార్జున గట్టి క్లాస్,త్రిగుణ్‌కు షాక్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

