Raju murugan Interview | కార్తీని మైండ్‌లో పెట్టుకొని కథ రాశా : జపాన్ డైరెక్టర్ రాజుమురుగన్ ఇంటర్వ్యూ
Raju murugan Interview | కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi)టైటిల్ రోల్లో నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ జపాన్ (Japan). నవంబర్ 10న (రేపు) థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రాజు మురుగన్ (Raju murugan) మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. జపాన్ విశేషాలు రాజుమురుగన్ మాటల్లోనే...
Raju murugan Interview | కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi)టైటిల్ రోల్లో నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ జపాన్ (Japan). కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రానికి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనూ ఎమ్మాన్యుయేల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. నవంబర్ 10న (రేపు) థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రాజు మురుగన్ (Raju murugan) మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. జపాన్ విశేషాలు రాజుమురుగన్ మాటల్లోనే…
సినిమా ఎలా మొదలైంది..?
నేను జపాన్ కథ రాసేలా ప్రేరేపించిన వారిలో కార్తీ ఒకరు. నా గత సినిమాల్లో పెద్ద హీరోలెవరూ లేరు. కార్తీ నాకు మంచి స్నేహితుడు. కార్తీని కలిసినప్పుడు.. ఒకవేళ క్లీన్ హ్యూమర్ టచ్‌తో మంచి కథ రాస్తే నాతో సినిమా చేస్తానని ప్రామిస్ చేశారు. కార్తీ లాంటి పెద్ద హీరోలతో సినిమా చేసినప్పుడు సందేశం ఎక్కువమంది ప్రేక్షకులకు చేరుతుంది.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌తో పనిచేయడం ఎలా ఉంది..?
జపాన్ క్యారెక్టర్ ఆధారంగా సాగే సినిమా. కార్తీ సార్‌ను మైండ్‌లో పెట్టుకొని కథ రాశా. నిర్మాతలు ప్రభు, ప్రకాశ్ నాకు చాలా కాలం నుంచి మంచి స్నేహితులు. వారితో జోకర్ సినిమా చేశా. వారు అన్ని రకాలుగా నాకు సపోర్టు ఇచ్చారు. వారి సహకారంతోనే జపాన్ తీయడం సాధ్యమైంది.
కార్తీతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది..?
కార్తీ విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తూ.. తనను తాను అన్ని రకాల పాత్రల్లో సహజసిద్దంగా అడాప్ట్ చేసుకునే నాన్ స్టీరియోటిపికల్ యాక్టర్. షూటింగ్ టైంలో చాలా సలహాలు ఇచ్చారు. చాలా ప్రశ్నలు అడిగారు. ఆయన ప్రశ్నలు చాలా కొత్త ఐడియాలను లేవనెత్తాయి. కార్తీ సార్‌తో పనిచేయడం అద్భుతమైన అనుభవం.
మీ సినీ ప్రయాణం ఎలా ఉంది..?
జర్నలిస్ట్‌గా ప్రయాణం మొదలుపెట్టా. అంతేకాదు నేనొక రైటర్, సామాజిక కార్యకర్త. చార్లీ చాప్లిన్ సినిమాలు చూసిన తర్వాత ఓ ఆలోచన నా మైండ్‌లో తట్టింది. ఒక మూకీ సినిమా చాలా ఆలోచనలను, భావోద్వేగాలను తట్టిలేపినప్పుడు.. ఇప్పుడున్న టెక్నాలజీని వినియోగించి జనాలకు మరింత కనెక్ట్ అయ్యేలా ఉత్తమంగా పనిచేయొచ్చు.
మీరు ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు..?
చిన్న, పెద్దా.. అన్ని రకాల సినిమాలు చేయడానికి నేను రెడీ. మనం సినిమా తీయాలంటే మొదట మనకు నచ్చాలి. ఆ తర్వాత ప్రేక్షకులు ఖచ్చితంగా ప్రశంసిస్తారని నేను నమ్ముతా. నా సినిమాలన్నింటిని చాలా ఇష్టంగా తీశా. జపాన్ మనల్ని మరోస్థాయికి తీసుకెళ్తుంది.
జపాన్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి.

Karthi 1

Karthi 2

Karthi 3

Karthi 4

Karthi 5
జపాన్ తెలుగు థ్రియాట్రికల్ రైట్స్‌ను పాపులర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అక్కినేని నాగార్జున హోంబ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ దక్కించుకుంది. జపాన్ మూవీలో సునీల్, విజయ్ మిల్టన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
జపాన్ వర్కింగ్ స్టిల్స్..
#Japan New Stills..💥 Grand Audio Launch loading for this #Karthi‘s 25th Film..⭐ pic.twitter.com/YLRNBUFMiN
— Laxmi Kanth (@iammoviebuff007) October 25, 2023
#Japan Telugu Theatrical Rights bagged by the prestigious @AnnapurnaStdios ❤️🔥
Exploding this Diwali 💥
ICYM the #JapanTeaser
– https://t.co/dGkgNHAhRZ@Karthi_Offl @ItsAnuEmmanuel @vagaiyaar @ksravikumardir #Sunil @vijaymilton @sanalaman @gvprakash @dop_ravivarman… pic.twitter.com/hIQgbEYA5j— Annapurna Studios (@AnnapurnaStdios) October 21, 2023
Touching Touching వీడియో సాంగ్..
జపాన్ టీజర్..
Get ready to meet the Pan India thief! Unmasking the enigmatic world of #Japan💥#JapanTeaser
Tamil : https://t.co/fXwdG7DTwT
Telugu : https://t.co/uu3mVE0BHi@Karthi_Offl @ItsAnuEmmanuel @vagaiyaar @ksravikumardir #Sunil @vijaymilton @sanalaman @gvprakash @dop_ravivarman… pic.twitter.com/aQT5ZYXk1Q— BA Raju’s Team (@baraju_SuperHit) October 18, 2023
జపాన్ ఇంట్రడక్షన్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

