Malvika Nair | నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుంది
‘ఇప్పటివరకు నేను సున్నితమైన పాత్రల్లోనే కనిపించాను. కానీ ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో మాత్రం చాలా భిన్నమైన రోల్లో కనిపిస్తాను’ అని చెప్పింది మాళవిక నాయర్. ఆమె సంతోష్శోభన్ సరసన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
‘ఇప్పటివరకు నేను సున్నితమైన పాత్రల్లోనే కనిపించాను. కానీ ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో మాత్రం చాలా భిన్నమైన రోల్లో కనిపిస్తాను’ అని చెప్పింది మాళవిక నాయర్. ఆమె సంతోష్శోభన్ సరసన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంకదత్ నిర్మాత. మే 18న విడుదలకానుంది.
ఈ సందర్భంగా మాళవిక నాయర్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో స్వతంత్ర భావాలు కలిగిన యువతి పాత్రలో కనిపిస్తా. మనసులో ఏదీ దాచుకోకుండా నిజాయితీగా అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తాను. నా వ్యక్తిత్వానికి దగ్గరగా కనిపించే పాత్ర ఇది. దర్శకురాలు నందిని రెడ్డి రెండేళ్ల క్రితమే ఈ కథ చెప్పారు. అద్భుతంగా అనిపించింది.
ఈ కథ ఎక్కువ భాగం హిల్స్టేషన్ నేపథ్యంలో సాగుతుంది. సినిమా జయాపజయాల గురించి నేను ఎక్కువగా ఆలోచించను. కథను ఎంచుకోవడం, నటించడం మాత్రమే నా చేతిలో ఉంటుంది. మిగతా ఏ విషయాల్ని అంతగా పట్టించుకోను. వృత్తిపరంగా ప్రతీ విషయంలో నిజాయితీగా ఉంటాను. సక్సెస్ కంటే అదే ముఖ్యమని భావిస్తా. ప్రస్తుతం ‘డెవిల్’ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నా. భవిష్యత్తులో యాక్షన్ సినిమా చేయాలనుంది’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

