Rakhi Sawant | నా వయస్సు మగాళ్లకే నా ప్రాధాన్యం.. ప్రియాంకా చోప్రాలా కుర్రాళ్లను ఇష్టపడను : రాఖీ సావంత్ కామెంట్స్
Rakhi Sawant | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా పేరున్న రాఖీ సావంత్ ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని, విడాకులు తీసుకున్న ఆమె.. మూడో పెళ్లి గురించి మాట్లాడుతూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రాపై సెటైర్లు వేసింది. ప్రియాంకా చోప్రా తనకంటే వయసులో చాలా చిన్నవాడైన నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకోవడాన్ని ఉద్దేశించి రాఖీ వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది.
Rakhi Sawant : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా పేరున్న రాఖీ సావంత్ ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని, విడాకులు తీసుకున్న ఆమె.. మూడో పెళ్లి గురించి మాట్లాడుతూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రాపై సెటైర్లు వేసింది. ప్రియాంకా చోప్రా తనకంటే వయసులో చాలా చిన్నవాడైన నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకోవడాన్ని ఉద్దేశించి రాఖీ వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది.
నా వయస్సులో సగం వయస్సున్న కుర్రాళ్లను ఇష్టపడేందుకు తానేమీ ప్రియాంకా చోప్రాను కాదని రాఖీ సావత్ ఆమె వ్యక్తిగత జీవితం గురించి కామెంట్ చేసింది. ఆ వెంటనే ప్రియాంకా చోప్రా అందాన్ని పొగిడింది. ప్రియాంకా చోప్రా వయస్సు పెద్దగా కనిపించదని, ఆమె యువతిలా ఉంటుందని వ్యాఖ్యానించింది. చూడటానికి నిక్ జొనాస్ కంటే ప్రియాంకా చోప్రానే చిన్నదానిలా కనిపిస్తుందని పేర్కొన్నది.
తన వెంట 16, 17, 18 ఏళ్ల వయస్సున్న కుర్రాళ్లు పడుతుంటారని, కానీ ఆ వయస్సు కుర్రాళ్లు తనకు నచ్చరని రాఖీ సావంత్ చెప్పింది. కుర్రాడిని బుట్టలో వేసుకొని పెళ్లి చేసుకోవడానికి నేనేమీ ప్రియాంకా చోప్రాని కాదని వ్యాఖ్యానించింది. తాను తన వయస్సు మగవాళ్లనే ఇష్టపడతానని చెప్పింది. కాగా రాఖీ సావంత్ కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ప్రియాంక చోప్రా తన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉన్నప్పటికీ.. ఆమెను రాఖీ వివాదంలోకి లాగడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

