Varsha Bollamma | స్కూల్ టీచర్‌గా కనిపిస్తా..నాకు గురువెవరూ లేరు : హీరోయిన్ వర్షబొల్లమ్మతో చిట్‌చాట్
గణేశ్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం స్వాతిముత్యం (Swathi Muthyam). అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ వర్ష బొల్లమ్మ మీడియాతో చిట్ చాట్ చేసింది..ఆ చిట్ చాట్ విశేషాలివి..
టాలీవుడ్ సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు గణేశ్ (Bellamkonda Ganesh), వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం చిత్రం స్వాతిముత్యం (Swathi Muthyam). అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ వర్ష బొల్లమ్మ మీడియాతో చిట్ చాట్ చేసింది..ఆ చిట్ చాట్ విశేషాలివి..
ఈ చిత్రంలో నా రోల్ పేరు భాగ్యలక్ష్మి. ప్రీ-ప్రైమరీ స్కూల్ టీచర్‌గా కనిపిస్తా. భాగ్యలక్ష్మి సినిమాలో గణేష్‌ని కొంత డామినేట్ చేస్తుంది. నేను ధృడమైన ఆత్మవిశ్వాసం కలిగిన అమ్మాయిగా కనిపిస్తే.. గణేష్ అమాయకత్వ వ్యక్తిత్వంతో కనిపిస్తాడని చెప్పుకొచ్చింది.
నాకు గురువెవరూ లేరు..
ఆ పాత్రను పోషించడానికి నాకు నిజ జీవితంలో గురువెవరూ లేరు. నాకు ఉత్తమ టీచర్లున్నప్పటికీ, స్వాతిముత్యంకు మాత్రం ఎవరూ రెఫరెన్స్ గా లేరు. భాగ్యలక్ష్మి కఠినంగా వ్యవహరించే టీచర్‌గానే కాకుండా. సరదాగా ప్రేమించే అమ్మాయి కూడా. నేను పిల్లల మధ్య గడపటాన్ని చాలా ఆనందిస్తాను. పిల్లల మధ్య నటించడం నాకు చాలా సరదాగా అనిపించింది.
గణేశ్ ప్రిపేర్ అయి వస్తాడు..
గణేష్‌కు సినీ పరిశ్రమ, ఫిల్మ్ మేకింగ్‌పై అవగాహన ఉంది. అతను సెట్స్‌లోకి ఎప్పుడూ కొత్తవాడిలా కాకుండా ప్రిపేర్ అయి వస్తాడు. ఒక నటిగా నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది.. కానీ ప్రేక్షకులు మాత్రం నన్ను పక్కింటి అమ్మాయి పాత్రలో చూడడానికి ఇష్టపడతారు. నా కెరీర్లో ఆ పాత్రలు చాలా ప్రాచుర్యం పొందాయి.
డైరెక్టర్ లక్ష్మణ్ కే కృష్ణ గురించి..
మొదట డైరెక్టర్ లక్ష్మణ్ కె కృష్ణను కలిసినప్పుడు మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా ఫిల్మ్ మేకర్ వినోద్ అనంతోజు గుర్తకొచ్చారు. ఈ ఇద్దరూ చిన్న పట్టణాల నుండి వచ్చారు. లక్ష్మణ్ రచయితగా, దర్శకుడిగా క్లారిటీతో ఉన్నారు. ఈ సినిమాపై నాకు పూర్తి నమ్మకం ఉంది.
Bhagya Lakshmi aka @VarshaBollamma Interaction with Media!
In cinemas #SwathimuthyamOnOct5th ✨#Swathimuthyam #Ganesh @Lakshmankkrish2 @mahathi_sagar @dopSURYAA @NavinNooli @vamsi84 @adityamusic @Fortune4Cinemas @SitharaEnts pic.twitter.com/J0zqrVPJYm
— BA Raju's Team (@baraju_SuperHit) October 3, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

