Payal Rajput | పచ్చళ్లు అమ్ముకునే యువతిగా కనిపిస్తా.. జిన్నా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ చిట్ చాట్
మంచు విష్ణు (Manchu vishnu), పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), సన్నీలియోన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం జిన్నా (Ginna). ఆక్టోబర్ 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మీడియాతో చిట్ చాట్ చేసింది.
మంచు విష్ణు (Manchu vishnu), పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), సన్నీలియోన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం జిన్నా (Ginna). ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆక్టోబర్ 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మీడియాతో చిట్ చాట్ చేసింది. జిన్నాకు సంబంధించిన విశేషాలు..పాయల్ మాటల్లోనే..
జిన్నా అవకాశం ఎలా వచ్చింది..?
ఒక రోజు.. మోహన్ బాబు సార్ నాకు ఫోన్ చేసి..అనగనగా ఓ అతిథిలో నా యాక్టింగ్‌ను మెచ్చుకున్నారు. ఇది నాకు సర్ప్రైజ్ లాంటిది. ఓ నటిగా నాలో చాలా ఆత్మవిశ్వాసాన్ని నింపింది. కాల్ వచ్చిన 2 నెలల తరవాత జిన్నాలో పనిచేసే అవకాశం దొరికింది.
సినిమాలో మీ పాత్ర గురించి..?
పచ్చళ్లు అమ్ముకునే గ్రామీణ యువతిగా కనిపిస్తా. ఈ పాత్ర కోసం బాడీ లాంగ్వేజ్, డిక్షన్ మార్చుకోవడం నాకు కొత్త అనుభవాన్ని ఇచ్చింది. నా డైరెక్టర్, కోన వెంకట్ సాయంతో నా పాత్రను బ్యాలెన్స్ చేయగలిగా.
మంచు విష్ణుతో కలిసి పనిచేయడం గురించి..?
నేను కలిసిన వినయపూర్వక స్వభావం కలిగిన వ్యక్తులో విష్ణు ఒకరు. సినిమా చేస్తున్న సమయంలో విష్ణు నాకు చాలా సాయం చేశారు. సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డాడు. జిన్నా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది.
సన్నీలియోన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై..?
ఆమెతో స్క్రీన్ పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. సెట్స్‌లో చాలా సందడి చేశాం. సినిమాలో గ్లామర్, కామెడీని ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. సన్నీలియోన్ జిన్నా చాలా కీలకంగా సాగే పాత్రలో కనిపిస్తుంది. ఆమె పాత్రలో చాలా బాగా ఒదిగిపోయారు.
మీ సినీ కెరీర్‌పై సంతోషంగా ఉన్నారా..?
ఆర్ఎక్స్ 100 సక్సెస్ తర్వాత నాకు సరైన గైడెన్స్ దొరకలేదు. వెంటవెంటనే సినిమాలకు సంతకం చేశాను. ఇపుడు సినిమాలను ఒకే చేసేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా. నటనకు ఆస్కారమున్న సినిమాలకే ప్రాధాన్యమిస్తున్నా. ఇప్పటి నుంచి నన్ను మంచి పాత్రల్లో చూస్తారు.
జిన్నా హైలెట్స్ ఏంటీ..?
పక్కా మసాలా-కామెడీ ఎంటర్టైనర్. ప్రేక్షకులకు ఏమాత్రం నిరాశ చెందకుండా ఉండేలా ఇషాన్ సూర్య సినిమా తీశాడు. ఫన్ డ్రామా కలయికతో జిన్నా థ్రిల్ అందించడం ఖాయం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

