Duniya Vijay | బాలకృష్ణతో నటించే ఛాన్స్ రావడం నా అదృష్టం.. దునియా విజయ్ చిట్‌చాట్
గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వం వహిస్తున్నవీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ ధునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ధునియా విజయ్ మీడియాతో చిట్ చాట్ చేశాడు.
నందమూరి బాలకృష్ణ (Balakrishna) టైటిల్ రోల్ పోషిస్తోన్న ప్రాజెక్ట్ వీరసింహారెడ్డి (Veera Simha Reddy). గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నాడు. వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ధునియా విజయ్ మీడియాతో చిట్ చాట్ చేశాడు. సినిమా విశేషాలు దునియా విజయ్ (Duniya Vijay) మాటల్లోనే..
వీరసింహారెడ్డితో మీ ప్రయాణం ఎలా మొదలైంది..?
డైరెక్టర్ గోపీచంద్ మలినేని నా పాత్ర గురించి వివరించారు. చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. బాలకృష్ణగారితో నటించడం గొప్ప అఛీవ్మెంట్. సినిమాకు విలన్ క్యారెక్టర్ మెయిన్ పిల్లర్. బాలకృష్ణ సినిమాలో అలాంటి మంచి పాత్ర చేసే ఛాన్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నా.
మిమ్మల్నే విలన్ పాత్రలో ఎందుకు సెలెక్ట్ చేశారని డైరెక్టర్‌ను అడిగారా..?
ఇదే విషయం గోపీచంద్‌ను అడిగా. ఆయన నేను చేసిన సినిమాలు చూశారు. విలన్ పాత్రకు నేనైతే కరెక్ట్‌గా సూటవుతానని భావించారు. ఈ ఛాన్స్ రావడం నా టైం, అదృష్టం బాగుండటం వల్లేనని అనుకుంటున్నా.
సినిమాలో మీ లుక్ ఎలా ఉండబోతుంది..?
చాలా వైల్డ్‌గా ఉండబోతుంది. నా పాత్ర పేరు ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి. స్క్రీన్‌పై నన్ను చాలా డిఫరెంట్‌గా చూస్తారు.
బాలకృష్ణగారితో మీ కెమిస్ట్రీ గురించి..?
గొప్ప విలువలు పాటించే వ్యక్తి బాలకృష్ణ. నేను ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అందుకే ఆయన పక్కనే నటిస్తున్నానంటేనే మాటలు రావడం లేదు. సెట్స్ లో బాలకృష్ణను మొదటిసారి చూసినపుడు ఇది నిజమేనా..? అని నా కండ్లను నేనే నమ్మలేకపోయా.
మీరు డైరెక్టర్ కదా.. ఆ స్కిల్స్ యాక్టింగ్‌కు ఏమైనా హెల్ప్ అయ్యాయా..?
యాక్టింగ్, డైరెక్షన్ రెండు వేర్వేరు విషయాలు. దర్శకుడు నటీనటుల్లో ఉత్తమ యాక్టింగ్‌ను బయటకు తీయాలి. నేను యాక్టర్‌గా ఉన్నప్పుడు.. నా నుండి ఆశించిన వాటిని అందించడమే నా పని. అందుకే నటించేటపుడు డైరెక్షన్ గురించి అంతగా ఆలోచించలేదు. నా పాత్రకు దర్శకుడు ఏం డిమాండ్ చేస్తున్నాడనే దానిపైనే ఫోకస్ పెడతా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

