దక్షిణాది సినిమాల్ని ఇష్టపడతాను
నేను పుట్టి పెరిగిన ముంబయిలోనూ ఇంతటి ప్రేమ, అభిమానాన్ని చూడలేదు. ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఓ పండగలా అనిపిస్తున్నది. దక్షిణాది సినిమాలంటే నాకు చాలా ఇష్టం. రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, పవన్‌కల్యాణ్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ అందరి నటనను ఇష్టపడతా. ఇక డార్లింగ్ ప్రభాస్‌కు వీరాభిమానిని’ అన్నారు రణబీర్‌కపూర్. ఆయన హీరోగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం సెప్టెంబర్ 9న విడుదలకానుంది
‘నేను పుట్టి పెరిగిన ముంబయిలోనూ ఇంతటి ప్రేమ, అభిమానాన్ని చూడలేదు. ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఓ పండగలా అనిపిస్తున్నది. దక్షిణాది సినిమాలంటే నాకు చాలా ఇష్టం. రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, పవన్‌కల్యాణ్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ అందరి నటనను ఇష్టపడతా. ఇక డార్లింగ్ ప్రభాస్‌కు వీరాభిమానిని’ అన్నారు రణబీర్‌కపూర్. ఆయన హీరోగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం సెప్టెంబర్ 9న విడుదలకానుంది. దీనికి రాజమౌళి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఆయాన్ ముఖర్జీ దర్శకుడు. చిత్ర ప్రమోషన్లో భాగంగా రణబీర్‌కపూర్, రాజమౌళి, ఆయాన్ ముఖర్జీ మంగళవారం విశాఖపట్నం విచ్చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు ఆయాన్ముఖర్జీ మాట్లాడుతూ ‘ నేను భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్ని గౌరవిస్తా. భారతీయ మూలాల్ని ఈ సినిమాలో చూపించాం’ అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ ‘కరణ్‌జోహార్ కోరిక మేరకు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నా. దర్శకుడు ఆయాన్ముఖర్జీ ఈ కథ చెప్పినప్పుడు సినిమా పట్ల ఆయనకున్న తపన, అంకితభావం చూసి ఆశ్చర్యపోయా. తనదైన శైలి నటనతో రణబీర్‌కపూర్ కట్టిపడేస్తాడు. ఈ సినిమాలో ఆయన అభినయం హైలైట్‌గా ఉంటుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

