బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) నటిస్తోన్న తాజా చిత్రం ఫైటర్. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికాపదుకొనే (Deepika Padukone) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఫైటర్ కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం 2023 సెప్టెంబర్ 28న థియేటర్లలో సందడి చేయనుంది.
SEPTEMBER
28th
…
2023.#Fighter pic.twitter.com/dHlnmm5xEw— Hrithik Roshan (@iHrithik) March 10, 2022
బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇండియా తొలి ఏరియల్ యాక్షన్ ఫిల్మ్ గా రాబోతుంది. హృతిక్ రోషన్ మరోవైపు విక్రమ్ వేధ (Vikram Vedha) షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. విక్రమ్ వేధ ఈ ఏడాది సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తమిళ్లో హిట్‌గా నిలిచిన విక్రమ్ వేధను సేమ్ టైటిల్‌తో హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర చేస్తున్నాడు.