Christian Oliver | కరేబియన్ సముద్రంలో కూలిన విమానం.. ఇద్దరు కూతుళ్లు సహా హాలీవుడ్ నటుడు దుర్మరణం
ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ (Christian Oliver), అతని ఇద్దరు కూతుళ్లు విమాన ప్రమాదంలో మరణించారు. వెకేషన్లో భాగంగా ఒలివర్ తన కుటుంబంతో కలిసి గ్రెనడైన్స్‌లోని బెక్వియా ద్వీపం నుంచి సెయింట్ లూసియాకు వెళ్తున్నారు.
లాస్ఏంజెలస్: ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ (Christian Oliver), అతని ఇద్దరు కూతుళ్లు విమాన ప్రమాదంలో మరణించారు. వెకేషన్లో భాగంగా ఒలివర్ తన కుటుంబంతో కలిసి గ్రెనడైన్స్‌లోని బెక్వియా ద్వీపం నుంచి సెయింట్ లూసియాకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బెక్వియాలో టేక్ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కరీబియన్ సముద్రంలో (Caribbean Sea) కుప్పకూలింది. దీంతో 51 ఏండ్ల ఒలివర్తోపాటు ఆయన ఇద్దరు కుమార్తెలు మడిత, అన్నీక్ అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో పైలట్కూడా మృతిచెందారు. సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్ సిబ్బంది మత్స్యకారులతో కలిసి వారి మృతదేహాలను వెలికితీశారు.
జర్మనీలో పుట్టిన ఒలివర్.. ‘ది గుడ్ జర్మన్’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. 2008లో వచ్చిన యాక్షన్-కామెడీ చిత్రం ‘స్పీడ్ రేసర్’లో జార్జ్ క్లూనీతో కలిసి బిగ్ స్క్రీన్‌పై కనిపించారు. కెరీర్ ప్రారంభంలో టీవీ షోలు చేసిన ఆయన ఇప్పటివరకు ఆయన 60కిపైగా సినిమాల్లో నటించారు.


Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

