Hit-2 Movie | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్-2.. కానీ?
మేజర్‌తో పాన్ ఇండియా రేంజ్లో హిట్టు కొట్టిన అడివిశేష్.. ఇటీవలే హిట్టు-2తో మరో బ్లాక్‌బస్టర్ సాధించాడు. సైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలై సంచలన విజయం సాధించింది.
Hit-2 Movie | టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరుమీదున్నాడు. తన థ్రిల్లర్ జానర్లో కంఫర్ట్‌గా సినిమాలు చేసుకుంటూ వరుసగా హిట్లు కొడుతున్నాడు. గతేడాది ద్వితియార్థంలో మేజర్‌తో పాన్ ఇండియా రేంజ్లో హిట్టు కొట్టిన అడివిశేష్.. ఇటీవలే హిట్టు-2తో మరో బ్లాక్‌బస్టర్ సాధించాడు. సైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలై సంచలన విజయం సాధించింది. ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల బాట పట్టింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా పే పర్ వ్యూ పద్ధతిలో ఉంది. ఈ సినిమాను చూడాలంటే సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్లు అదనంగా రూ.199 రెంటు కట్టి చూడాల్సి ఉంటుంది. ఈ పద్దతి మూడు రోజులు మాత్రమే కొనసాగనున్నట్లు తెలుస్తుంది. జనవరి 6నుండి సబ్స్క్రిప్షన్ ఉన్నవాళ్లు ఫ్రీగా చూసే వెసులుబాటు కల్పించనున్నట్లు టాక్. కమర్షియల్‌గా ఈ సినిమా అడివి శేష్‌కు వరుసగా ఆరో విజయం. ఈ మధ్య కాలంలో హ్యట్రిక్ సాధించడమే గగనంలా ఉంది. అలాంటిది శేష్ డబుల్ హ్యట్రిక్ సాధించాడంటే విశేషం అనే చెప్పాలి.
సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం హిట్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో అడివిశేష్‌కు జోడీగా మీనాక్షీ చౌదరీ నటించింది. కోమలి ప్రసాద్, రావు రమేష్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని నిర్మించాడు. ఇక మూడో పార్ట్‌లో నాని కథానాయకుడిగా నటించనున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

