Highway: సైకోగా విజయ్ దేవరకొండ సోదరుడు..!

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కెరీర్లో నిలదొక్కుకునేందుకు గట్టిగా కృషి చేస్తున్నాడు. దొరసాని చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆనంద్ ..మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే చిత్రంతో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాత పుష్పక విమానం అనే చిత్రం చేయగా, ఈ మూవీకి మిక్స్డ్ టాక్ లభించింది. అయితే ఇప్పడు కళ్యాణ్ రామ్ తో ‘118’ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తెరకెక్కించిన కేవీ గుహన్ దర్శకత్వంలో ఆనంద్ హీరోగా చేయబోతున్నాడు.
సైకో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాకి హైవే అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఇందులో సైకోగా కనిపించనున్న ఆనంద్ తన లుక్‌ని పూర్తిగా మార్చుకోనున్నట్టు తెలుస్తుంది. మలయాళ బ్యూటీ మానస రాధాకృష్ణన్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ సయామీఖేర్ ముఖ్య పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అభిషేక్ బెనర్జీ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాని నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై వెంకట్ తలారి నిర్మిస్తున్నారు.
ఒకరితో ఒకరికి సంబంధం లేని నలుగురు వ్యక్తుల కథే `హైవే’. పూర్తిగా హైవే నేపథ్యంలోనే సాగే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. టెక్నికల్ పరంగా చాలా బాగుంటుందని, ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందని చిత్ర దర్శకుడు కేవీ గుహన్ ఈ సినిమా గురించి తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

