నా దృష్టిలో అదే గొప్ప స్థాయి!
“హాయ్ నాన్న’లో నటించిన వారందరూ తమ సినిమా అని ఓన్ చేసుకున్నారు. అందుకే ఈ అద్భుత విజయం సాధ్యమైంది. సినిమాకు అంతటా ప్రశంసలు లభిస్తున్నాయి.
“హాయ్ నాన్న’లో నటించిన వారందరూ తమ సినిమా అని ఓన్ చేసుకున్నారు. అందుకే ఈ అద్భుత విజయం సాధ్యమైంది. సినిమాకు అంతటా ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమా విషయంలో నేను నమ్మింది నిజమైనందుకు ఆనందంగా ఉంది’ అన్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రల్ని పోషించారు. శౌర్యువ్ దర్శకుడు. చిత్ర విజయాన్ని పురస్కరించుకొని ఆదివారం బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘బాక్సాఫీస్ లెక్కలను నేను అంతగా పట్టించుకోను. శుక్రవారం సినిమా విడుదలైతే ‘నాని సినిమాకు వెళ్దాం పదా..’ అని ప్రేక్షకులు అనుకున్నారంటే నా దృష్టిలో అదే గొప్ప స్థాయి. అంతకుమించిన స్థాయి ప్రపంచంలో మరొకటి లేదని నమ్ముతాను. ఇలాంటి మంచి సినిమాలు చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను’ అన్నారు. నాని వల్లనే సినిమాకు ఈ స్థాయి విజయం సాధ్యమైందని దర్శకుడు శౌర్యువ్ ప్రశంసించారు. కథ విన్నప్పుడే చాలా ఎమోషనల్‌గా అనిపించిందని, తమ బ్యానర్లో కలకాలం నిలిచిపోయే చిత్రమిదని నిర్మాతలు మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రియదర్శి, బేబీ కియారా, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

