‘హాయ్ నాన్న’ ఆనందభాష్పాలు తెప్పించే సినిమా
‘వైజాగ్‌తో నాది ప్రత్యేకమైన అనుబంధం. ఇక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని కాదు. నా సినిమాలు మిగతా ఏరియాలతో పోలిస్తే వైజాగ్‌లో బాగా ఆడతాయి.. అందుకు. ఈ డిసెంబర్ నెలంతా సినిమాల పండగలా అనిపిస్తుంది.
‘వైజాగ్‌తో నాది ప్రత్యేకమైన అనుబంధం. ఇక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని కాదు. నా సినిమాలు మిగతా ఏరియాలతో పోలిస్తే వైజాగ్‌లో బాగా ఆడతాయి.. అందుకు. ఈ డిసెంబర్ నెలంతా సినిమాల పండగలా అనిపిస్తుంది. 1న ‘యానిమల్’, 8న నా మిత్రుడు నితిన్ హీరోగా చేసిన ‘ఎక్స్ట్రా అర్డినరీ మ్యాన్’, 22న మనందరం ఎదురుచూస్తున్న ప్రభాస్ అన్న ‘సలార్’, అలాగే 21న నా ఫేవరెట్ డైరెక్టర్ రాజు హిరాణీ ‘డంకీ’, 29న సుమగారి అబ్బాయి ‘బబుల్గమ్’.. ఒకేనెలలో ఇన్ని సినిమాలు. వీటిమధ్య ఈ నెల 7న నా ‘హాయ్ నాన్న’. ఇవన్నీ బ్లాక్‌బాస్టర్స్ అయిపోయి, డిసెంబర్, జనవరి నెలలు సినిమా పండుగ నెలలుగా డిక్లేర్ అవ్వాలి’ అని హీరో నాని అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘హాయ్ నాన్న’.
మృణాళ్ ఠాకూర్ కథానాయిక. బేబీ కియారా కీలకభూమిక పోషించిన ఈ చిత్రానికి దర్శకుడు శౌర్యువ్. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల నిర్మాతలు. ఈ నెల 7న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా వైజాగ్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. నాని ఇంకా మాట్లాడుతూ- ‘ నాని ఈ సినిమాలో ఏడిపిస్తాడు. ఇదో ఎమోషనల్ సినిమా అనుకుంటున్నారు కదా. కాదు.. మీకళ్లల్లో నీళ్లు కూడా ఆనందంగా తిరుగుతాయి. ఆనందభాష్పాలు తెప్పించే సినిమా ఇది. సాంకేతికంగా అద్భుతంగా ఉంటుందీ సినిమా. ఈ సినిమాతో దర్శకుడిగా శౌర్యువ్ గొప్ప స్థాయికి వెళతాడు’ అని చెప్పారు నాని. ఇంకా మృణాళ్ఠాకూర్, ప్రియదర్శి, బేబీ కియారా, నిర్మాత డాక్టర్ విజయేందర్‌రెడ్డి, తదితరులు మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

