Adah Sharma | అదికూడా తప్పంటే ఎలా? చాలా బాధగా ఉంది: ఆదాశర్మ
ఆదాశర్మ ఎంత మంచి నటో ‘ది కేరళ స్టోరీ’ చూస్తే అర్థమవుతుంది. తెలుగులో ఆమె స్థాయి తగ్గ పాత్రలు ఆమెకు రాలేదనే చెప్పాలి. కేరక్టర్కోసం ఎంతటి సాహసానికైనా వెనుకాడని నటి ఆదాశర్మ. ఆమె నటించిన ‘బస్తర్' చిత్రం ఈ నెల 15న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
Adah Sharma | ఆదాశర్మ ఎంత మంచి నటో ‘ది కేరళ స్టోరీ’ చూస్తే అర్థమవుతుంది. తెలుగులో ఆమె స్థాయి తగ్గ పాత్రలు ఆమెకు రాలేదనే చెప్పాలి. కేరక్టర్కోసం ఎంతటి సాహసానికైనా వెనుకాడని నటి ఆదాశర్మ. ఆమె నటించిన ‘బస్తర్’ చిత్రం ఈ నెల 15న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే.. ఆ ఆనందం మాత్రం ఆమెకు లేదట. కారణం కొందరు నెటిజన్స్. ఈ సినిమా ఒప్పుకున్న దగ్గర్నుంచీ ఆమెపై ట్రోలింగ్ మొదలైందట. వ్యక్తిగత సాంఘిక మాధ్యమంలో ఆమె ఏ పోస్ట్ పెట్టుకున్నా కామెట్స్ మాత్రం ‘బస్తర్’ చిత్రాన్ని ఉద్దేశించే ఉంటున్నాయని అసహనం వ్యక్తం చేసింది ఆదాశర్మ.
‘కథల ఎంపిక పూర్తిగా నా వ్యక్తిగతం. నాకు నచ్చిన కథ అంగీకరిస్తా. అదికూడా తప్పంటే ఎలా? ‘ది కేరళ స్టోరీ’ టైమ్లో కూడా ఇలాగే మాట్లాడారు. అసభ్యంగా పోస్టులు పెట్టారు. చాలా బాధేసింది. స్వతంత్య్రభారతదేశంలో నచ్చిన కథలతో సినిమా తీసుకునే హక్కు మాకు లేదా? అసలు ఈ సినిమాలో నేను నటిస్తున్నానని అధికారిక ప్రకటన రాకముందే నాపై ట్రోల్స్ మొదలయ్యాయి. సినిమా విడుదలయ్యాక ట్రోల్స్ ఎక్కువైపోయాయి. నేను పువ్వుల ఫొటో పెట్టినా దానికి ఇబ్బందికరమైన కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఒకడుగు ముందుకేసి ‘వేశ్య’ లాంటి పదాలు కూడా వాడుతున్నారు. చాలా బాధగా ఉంది.’ అంటూ వాపోయింది ఆ దాశర్మ. అసలు ‘బస్తర్’లో ఏముంది? అనే విషయానికొస్తే.. ఇది నక్సల్ నేపథ్యంలో సాగే సినిమా. ‘ది నక్సల్ స్టోరి’ అనేది ఉపశీర్షిక. సమాజంలోని పలు వివాదాస్పద అంశాలతో దర్శకులు సుదీప్తోసేన్ చిత్రాన్ని తెరకెక్కించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

