ఆ టైటిల్ అనగానే భయమేసింది
స్నేహితులందరూ కలిసి పనిచేసిన సినిమా ఇది. ‘డార్లింగ్' అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్రభాస్ అన్న. ఈ సినిమాకు ఆ టైటిల్ ఖరారు చేయగానే భయమేసింది. అయితే కథకు ఆ టైటిల్ యాప్ట్. అందుకే పెట్టాం.
‘స్నేహితులందరూ కలిసి పనిచేసిన సినిమా ఇది. ‘డార్లింగ్’ అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్రభాస్ అన్న. ఈ సినిమాకు ఆ టైటిల్ ఖరారు చేయగానే భయమేసింది. అయితే కథకు ఆ టైటిల్ యాప్ట్. అందుకే పెట్టాం. నిర్మాతలు పాషన్‌తో డబ్బుకు వెనుకాడకుండా సినిమాను నిర్మించారు. నా కోస్టార్ నభానటేష్ ఎక్స్ట్రార్డినరీగా నటించింది. వివేక్‌సాగర్ మ్యూజిక్ సూపర్. ఇలా అన్ని విధాలుగా ఈ సినిమా ఆకట్టుకుంటుంది’ అని ప్రియదర్శి అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘డార్లింగ్’. ‘వైదిస్ కొలవెరి’ అనేది ఉపశీర్షిక. నభానటేష్ కథానాయిక. అశ్విన్‌రామ్ దర్శకుడు. కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు.
ఈనెల 19న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ప్రియదర్శి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన హీరో విశ్వక్సేన్ ట్రైలర్‌ని ఆవిష్కరించి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. తాను యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత చేసిన సినిమా ఇదని, అద్భుతమైన కథ, ఆకట్టుకునే కేరక్టర్స్‌తో రూపొందిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నభానటేష్ నమ్మకం వ్యక్తం చేసింది. సినిమా చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుందని, మంచి టీమ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని దర్శకుడు చెప్పారు. ఇంకా నిర్మాత చైతన్యరెడ్డి కూడా మాట్లాడారు. చిత్రయూనిట్ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

