Hero Vishal | ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్‌కు హీరో విశాల్ ధన్యవాదాలు తెలియజేశారు. దక్షిణభారత చలనచిత్ర నటీనటుల సంఘం(నడిగర్ సంఘం) భవన నిర్మాణం కోసం కమల్‌హాసన్ కోటి రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ చెక్‌ను హీరో కార్తీకి అందజేశారు. దీనికి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ ఈ సందర్భంగా కమల్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
‘ఈ భవన నిర్మాణం అనుకున్నప్పట్నుంచీ కమల్ మా వెంటే ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూనే వున్నారు. భవన నిర్మాణం చేయాలని నిర్ణయించిన తొలినాళ్లలో కోటి రూపాయలు విరాళంగా సంఘానికి అందించారు. ఇప్పుడు నిధుల కొరత వల్ల నిర్మాణంలో జాప్యం జరుగుతుంటే మళ్లీ మరో కోటి విరాళంగా ఇచ్చారు. సమాజం గురించి ఆలోచించే మంచి మనసు కమల్సార్ది. అందుకే మాలాంటి ఎందరికో ఆయన ఆదర్శం. దేవుని దయ ఎల్లవేళలా మీపై ఉంటుందిసార్..’ అంటూ ధన్యవాదాలు తెలిపారు విశాల్.