స్వీయ నిర్మాణంలో అభినవ్ సర్దార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టేక్’. భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. సోమవారం ఈ చిత్ర ట్రైలర్ను హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఓ ఇంట్రెస్టింగ్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. చిన్న తప్పు ఎలాంటి పరిణామాలకు దారితీసిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. స్క్రీన్ప్లే సరికొత్త పంథాలో ఉంటుంది’ అన్నారు. హీరో అభినవ్ సర్దార్ మాట్లాడుతూ ‘కథపై నమ్మకంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నటుడిగా నాకు సరికొత్త గుర్తింపును తీసుకొస్తుంది. కథలోని మలుపులు ఉత్కంఠను పంచుతాయి’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీ పట్నాయక్, లగడపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.