చాలా రోజులు గుర్తుండిపోతుంది
వంశాలు, తరాల నేపథ్యంలో జరిగే పెద్ద కథ ఇది. దీనిని తెరపై తీసుకురావడం అంత సులభం కాదు. ఇప్పటివరకు ఏ సినిమాలో నేను డబుల్ యాక్షన్ చేయలేదు. అలాంటిది ఇందులో నాలుగు పాత్రల్ని పోషించాను’ అన్నారు హీరో శ్రీవిష్ణు. ఆయన నటించిన తాజా చిత్రం ‘శ్వాగ్'. హసిత్ గోలి దర్శకుడు.
‘వంశాలు, తరాల నేపథ్యంలో జరిగే పెద్ద కథ ఇది. దీనిని తెరపై తీసుకురావడం అంత సులభం కాదు. ఇప్పటివరకు ఏ సినిమాలో నేను డబుల్ యాక్షన్ చేయలేదు. అలాంటిది ఇందులో నాలుగు పాత్రల్ని పోషించాను’ అన్నారు హీరో శ్రీవిష్ణు. ఆయన నటించిన తాజా చిత్రం ‘శ్వాగ్’. హసిత్ గోలి దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ నెల 4న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘ఈ సినిమా కథలో కామెడీతో పాటు హృదయాల్ని కదిలించే ఎమోషన్స్ ఉంటాయి. చాలా రోజుల పాటు గుర్తుండిపోతుంది. కుటుంబ సమేతంగా చూసి ఆనందించేలా సినిమాను తీర్చిదిద్దాం’ అన్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు పోషించిన నాలుగు పాత్రలు వేటికవే ప్రత్యేకంగా కనిపిస్తాయని, కమల్‌హాసన్ తరహాలో నాలుగు పాత్రల్ని ధైర్యంగా చేశారని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. దర్శకుడు హసిత్ గోలి మాట్లాడుతూ ‘శ్రీవిష్ణు నాలుగు పాత్రల్లో అద్భుతమైన నటన కనబరిచాడు. వివేక్‌సాగర్ మ్యూజిక్ ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ఇంటర్వెల్, ైక్లెమాక్స్ ఘట్టాలు ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచుతాయి’ అన్నారు. ఈ సినిమాలో తాను పోషించిన మహారాణి పాత్ర చాలా కొత్తగా ఉంటుందని కథానాయిక రీతూవర్మ చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

