భద్రాచలం, మే 13: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి ప్రముఖ సినీ హీరో ప్రభాస్ రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు పేరిట ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును ప్రభాస్ తరఫున ఆయన బంధువులు శనివారం దేవస్థానం ఈవో ఎల్. రమాదేవికి అందజేసి రసీదు తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘ఆది పురుష్’ సినిమాలో శ్రీరాముడిగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైన విషయం తెల్సిందే.