చిరంజీవి సినిమాల్ని రిఫరెన్స్‌గా తీసుకున్నా

‘సినిమాల్లో నటించాలనుందని అనగానే అమ్మానాన్నలు భయపడ్డారు. సినీ నటుల జీవితాల్లోని ఎత్తుపల్లాలను అమ్మ ప్రత్యక్షంగా చూసింది. ఆ కష్టాలను తట్టుకుంటూ నేను రాణిస్తానో లేదో అన్న భయంతో వద్దని వారించింది. నాన్న కూడా సినిమాలకంటే వ్యాపారమే ఉత్తమమని సూచించారు. నటన పట్ల నాలో ఉన్న ఇష్టాన్ని గమనించి కాదనలేకపోయారు’ అని అన్నారు అశోక్ గల్లా. సీనియర్ కథానాయకుడు కృష్ణ మనవడిగా, మహేష్‌బాబు మేనల్లుడిగా సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేస్తున్నారు అశోక్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ నెల 15న విడుదలకానుంది. ఈ సందర్భంగా అశోక్ గల్లా పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..
పక్కా కమర్షియల్ సినిమా ఇది. కథలోని మలుపులకు అనుగుణంగానే హీరో అనే టైటిల్ పెట్టాం. ఇందులో నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తా. సినీనటుడు కావాలని కలలుకనే అతడి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనేది ఆసక్తికరంగా ఉంటుంది. అహంభావ మనస్తత్వమున్న యువకుడిగా మాస్ కోణంలో నా పాత్ర విభిన్నంగా ఉంటుంది. ఈ పాత్ర కోసం సన్నద్ధమయ్యేందుకు రిఫరెన్స్‌గా చిరంజీవి సినిమాలు చూశా.
డేరింగ్.. డాషింగ్..
ఘనమైన సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. ఆ గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నాపై ఉంది. నటన, డ్యాన్సుల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా. యాక్టింగ్‌లో డిగ్రీ పూర్తిచేశా. తాతయ్య కృష్ణగారి సినిమాతో పాటు మావయ్య మహేష్‌బాబు నటించిన ‘నాని’లో చిన్న పాత్ర చేశా. నటనాపరంగా కాకుండా వ్యక్తిగతంగా ఇండస్ట్రీలో ఎలా మెలగాలి, ఆత్మైస్థెర్యంతో ఏ విధంగా ముందుకుసాగాలో మహేష్ మావయ్య సలహాలిచ్చారు. డేరింగ్, డాషింగ్‌గా నిర్ణయాలు తీసుకోవడం ఎలాగో తాతయ్య నుంచి నేర్చుకున్నా. మావయ్యలోని సెన్సాఫ్హ్యూమర్ అంటే ఇష్టం. సినిమాలతో పాటు ప్రతి అంశంపై ఆయనకున్న అవగాహన, ప్రతిభ అబ్బురపరుస్తుంది. ఇటీవల మావయ్య కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారు. స్వీయనిర్భంధాన్ని పాటిస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారు.
హార్స్‌రైడింగ్ చాలెంజింగ్..
కౌబాయ్సన్నివేశాల్లో నటించడం చాలెంజింగ్‌గా అనిపించింది. హార్స్‌రైడింగ్ నాకు రాదు. దర్శకుడు ఆ సన్నివేశాల గురించి చెప్పగానే నెల రోజుల్లో నేర్చుకొని నటించా. కెమెరా ముందు నటించడానికి ఏ రోజు ఇబ్బంది పడలేదు. సినిమా పూర్తయిన తర్వాతే నా నటనను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అనే భయం మొదలైంది. జోనర్స్‌తో సంబంధం లేకుండా అన్ని రకాల కథలతో సినిమాలు చేయాలనుంది. ‘మిషన్ ఇంపాజిబుల్’ లాంటి యాక్షన్ సినిమా చేయాలన్నది నా కల. దిల్‌రాజు బ్యానర్లో గతంలో ‘ఇద్దరిలోకం ఒక్కటే’ అనే సినిమా చేయాల్సింది. అనివార్య కారణాల వల్ల వర్కవుట్ కాలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

