Raod Accident : తెలుగు చిత్రసీమలో విషాదం నెలకొంది. ఔటర్ రింగ్ రోడ్డు రోడ్డు ప్రమాదంలో హీరో భరత్ కాంత్, సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ దుర్మరణం చెందారు. బొంగులూరు గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్, త్రిలోక్ ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తున్న వీరి కారును వెనకాల నుంచి కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలతో ఇద్దరూ మృత్యువాత పడ్డారు.
ఇటీవల విడుదలైన ‘టాలెంట్ ‘సినిమాలో హీరోగా నటించిన భరత్ కాంత్ పలు తెలుగు, హిందీ వెబ్ సిరీస్‌లోనూ నటించాడు. త్రిలోక్ సైతం టాలీవుడ్లో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. అయితే.. దురదృష్టవశాత్తూ ఇద్దరూ కారులో నెల్లూరు వెళ్లి తిరిగి వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదం జరిగింది. వీరి కారును కంటైనర్ వెనక నుంచి ఢీకొట్టింది. దాంతో, ఎంతో ఉజ్వల భవిష్యత్తున్న త్రిలోక్, భరత్ ప్రాణాలు కోల్పోయారు.