paagal collections | పాగల్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ వచ్చేశాయి.. బొమ్మ హిట్టా ఫట్టా..?
paagal first weekend collections | విశ్వక్ సేన్‌కు ఉన్న ఇమేజ్ కారణంగా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా.. రెండో రోజు మాత్రం నిరాశ పరిచింది.

paagal first weekend collections | విశ్వక్ సేన్ హీరోగా దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మించిన సినిమా పాగల్. ఈ సినిమాను నరేష్ కుప్పిలి తెరకెక్కించాడు. ఆగస్ట్ 14న విడుదలైన ఈ చిత్రానికి ఊహించిన టాక్ రాలేదు. అయినా కూడా వసూళ్ల విషయంలో మాత్రం పాగల్ ఫర్వాలేదనిపించాడు. దానికి ప్రధానంగా విశ్వక్ సేన్‌కు ఉన్న ఇమేజ్ కారణం. మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా.. రెండో రోజు మాత్రం నిరాశ పరిచింది. శనివారం విడుదలైన ఈ చిత్రానికి రెండు రోజుల్లో దాదాపు రూ. 2.65 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఇంకా ఎంత వసూలు చేయాలి.. విశ్వక్ సేన్ ఎంత బాకీ ఉన్నాడనేది ఇప్పుడు చూద్దాం..

నైజాం: 1.02 కోట్లు
సీడెడ్: 0.38 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.44 కోట్లు
ఈస్ట్: 0.13 కోట్లు
వెస్ట్: 0.09 కోట్లు
గుంటూరు: 0.17 కోట్లు
కృష్ణా: 0.11 కోట్లు
నెల్లూరు: 0.07 కోట్లు
ఏపీ + తెలంగాణ: 2.41 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.23 కోట్లు
వరల్డ్ వైడ్: 2.64 కోట్లు
దిల్ రాజు నిర్మాణం.. విశ్వక్ సేన్ క్రేజ్‌తో పాగల్ సినిమాను రూ.6.3 కోట్లకు అమ్మారు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడానికి రూ.6.5 కోట్ల వరకు షేర్ తీసుకొని రావాలి. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.2.64 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ.3.9 కోట్ల వరకు షేర్ రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే అంత వసూలు చేయడం దాదాపు అసాధ్యం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
Vaishnav Tej | క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

