Om Bheem Bush | టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించిన కామెడీ డ్రామా ఓం భీమ్ బుష్ (Om Bheem Bush). సామజవరగమన లాంటి సూపర్ హిట్ తర్వాత బ్రోచెవారెవరురా కోస్టార్లు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, శ్రీవిష్ణు కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. కాగా హార్రర్ కామెడీ, ఎమోషన్స్‌ను హర్ష కొనుగంటి వినోదాత్మకంగా డిజైన్ చేసి అందరినీ ఇంప్రెస్ చేస్తున్నట్టు ఇప్పటివరకు వచ్చిన టాక్ చెబుతోంది.
అద్భుతమైన యాక్టింగ్, చక్కని కథనాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే పర్ఫెక్ట్ వీకెండ్ ఎంటర్టైనర్ అని ట్రేడ్ విశ్లేషకుల అంచనా. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, శ్రీవిష్ణు కాంబోలో వచ్చిన రెండో సినిమా కావడంతో హైప్ పెరిగిపోయింది. ఆ అంచనాలకు తగ్గట్టుగా ప్రదర్శించబడుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. మొత్తానికి శ్రీవిష్ణు ఖాతాలో మరోహిట్టు పడ్డట్టేనంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అయిన కొన్ని గంటల్లోనే ఓపెనింగ్ వీకెండ్‌కు సంబంధించిన చాలా షోల బుకింగ్స్ పూర్తయ్యాయని అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే.
శ్రీవిష్ణు నటించిన సామజవరగమన సినిమా టీజర్, థ్రియాట్రికల్ ట్రైలర్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేసి.. ఘన విజయం సాధించాయని తెలిసిందే. ముందుగా వచ్చిన అంచనాల ప్రకారం ఇప్పుడదే రూట్లో ఓం భీమ్ బుష్ సినిమా కూడా వెళ్తుందని ఇప్పటివరకు వచ్చిన రివ్యూస్ చెబుతున్నాయి. హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ సమర్పణలో యూవీ సెల్యూలాయిడ్, సునీల్ తెరకెక్కించారు. మిస్టరీ, థ్రిల్ ఎలిమెంట్స్‌తో ఇప్పటివరకూ రాని పాయింట్‌తో సినిమా ఉండబోతుందని శ్రీవిష్ణు ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడని తెలిసిందే.
‘Om Bheem Bush’ : A Contemporary & Captivating Humour Bound To Be Enjoyed
Rating: 3.5/5#OmBheemBush#OmBheemBushReview #OBB@industry_hit Movie Review 👇https://t.co/OVXpkAThR7@sreevishnuoffl @PriyadarshiPN @eyrahul @HarshaKonuganti #AyeshaKhan @PreityMukundan…
— BA Raju’s Team (@baraju_SuperHit) March 22, 2024
.#OmBheemBush Is Great Example & Sets The Standards Of A Clean Entertaining Film . The Bang Bro’s @sreevishnuoffl @PriyadarshiPN @eyrahul Had Kept Us Hooked With Outstanding Timing & Performance. @HarshaKonuganti Script & Execution Style Played A Key Role .
Rating : 3.5/5
The… pic.twitter.com/m01moaQe4m— BA Raju’s Team (@baraju_SuperHit) March 22, 2024
𝐁𝐀𝐍𝐆 𝐁𝐑𝐎𝐒 కి వచ్చేసింది…రాజయోగం 👑👑👑#OmBheemBush Third Single #DilDhadke out now 💥
▶️ https://t.co/HvPQGFo2VqGrand Release worldwide tomorrow ❤️🔥
Book your tickets now!Directed by @HarshaKonuganti#OBB@sreevishnuoffl @PriyadarshiPN @eyrahul #AyeshaKhan… pic.twitter.com/E0lYktDb4u
— BA Raju’s Team (@baraju_SuperHit) March 21, 2024
They are 𝗕𝗔𝗡𝗚 𝗕𝗥𝗢𝗦 💥
And they are coming to give us 𝗕𝗔𝗡𝗚 𝗕𝗔𝗡𝗚 𝗘𝗡𝗧𝗘𝗥𝗧𝗔𝗜𝗡𝗠𝗘𝗡𝗧 💥💥#OmBheemBush Grand release tomorrow ❤️🔥Book your tickets now!
🎟️ https://t.co/2nNjsCMyifDirected by @HarshaKonuganti#OBB@sreevishnuoffl @PriyadarshiPN @eyrahul… pic.twitter.com/2SwDNoEJ58
— BA Raju’s Team (@baraju_SuperHit) March 21, 2024
ఓం భీమ్ బుష్ ట్రైలర్..
ఓం భీమ్ బుష్ టీజర్..