Kantara 2 | కాంతార 2కు రిషబ్ శెట్టి టీం ఎంత బడ్జెట్ ఫిక్స్ చేసిందో తెలుసా..?
Kantara 2 | కన్నడ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్ పోషించిన కాంతార (kantara) కన్నడతోపాటు విడుదలైన అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచింది. హోంబలే ఫిలింస్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం రెండో పార్టు (kantara 2)కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పనులు ప్రారంభమైనట్లు పాపులర్ ప్రొడక్షన్ హౌజ్ (Hombale Films) ఇప్పటికే ప్రకటించింది.
Kantara 2 | కేజీఎఫ్ ప్రాంఛైజీ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి విడుదలై గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రాజెక్ట్ కాంతార (kantara). కన్నడ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్ పోషించాడు. కాంతార కన్నడతోపాటు విడుదలైన అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచింది. వరల్డ్‌వైడ్‌గా రూ.400 కోట్లు వసూళ్లు రాబట్టింది. కాంతార సెకండ్ పార్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ ఫేం హోంబలే ఫిలింస్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం రెండో పార్టు (kantara 2)కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పనులు ప్రారంభమైనట్లు పాపులర్ ప్రొడక్షన్ హౌజ్ (Hombale Films) ఇప్పటికే ప్రకటించింది.
కాంతార 2 ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. హోంబలే ఫిలిమ్స్ మేకర్స్ టీం సీక్వెల్ బడ్జెట్‌ను భారీగా పెంచినట్టు కన్నడ మీడియా సర్కిల్స్‌లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం కాంతార 2కు రూ.125 కోట్లు బడ్జెట్ పెట్టబోతున్నారట. కాంతార ఫస్ట్ పార్ట్‌కు ఊహించని రీతిలో స్పందన వచ్చిన నేపథ్యంలో.. ప్రీక్వెల్ బడ్జెట్ రికవరీ విషయంలో మేకర్స్ చాలా ధీమాగా ఉన్నారని ఇన్సైడ్ టాక్. రిషబ్ శెట్టి టీం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి.. షూటింగ్‌కు రెడీ అవుతున్నాడని సమాచారం. పంజుర్లి దేవుడు తులు ప్రాంత వాసుల జీవితాల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా ఎలా అవతరించాడనే నేపథ్యంలో ప్రీక్వెల్ ఉండబోతుందట.
కాంతారలో సప్తమి గౌడ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. కిశోర్, అచ్యుత్ కుమార్, నవీన్ డీ పడ్లి, ప్రమోద్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు. కాంతార సక్సెస్‌లో అంజనీష్ లోక్ నాథ్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక పాత్రలో పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేకించి కొన్ని సన్నివేశాల్లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం రిపీటెడ్‌గా వచ్చిన ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. మరి కాంతార 2కు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉండబోతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
ಬರವಣಿಗೆಯ ಆದಿ…
On this auspicious occasion of Ugadi & New Year, we are delighted to announce that the writing for the second part of #Kantara has begun. We can't wait to bring you another captivating story that showcases our relationship with nature. Stay tuned for more updates. pic.twitter.com/JPmtE5vtx2— Hombale Films (@hombalefilms) March 22, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

