రొమాంటిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఓకే.. రెండో రోజు పరిస్థితి ఏంటి..?

Romantic movie collections | పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా అనిల్ పడూరి తెరకెక్కించిన సినిమా రొమాంటిక్. ఈ సినిమాకు పూరీ కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాశాడు. దాంతో ఈ సినిమాపై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. అయితే ఇప్పుడు రొమాంటిక్ సినిమా విడుదలైన తర్వాత చూసి నీరసించిపోతున్నారు ఆడియన్స్. సినిమాలో ఉన్న రొమాన్స్ కారణంగా తొలిరోజు కలెక్షన్స్ వర్కవుట్ అయ్యాయి. ఏకంగా 1.60 కోట్లకు పైగానే షేర్ వసూలు చేసింది రొమాంటిక్ సినిమా. కేతిక శర్మ అందాలకు యువత ఫిదా అయిపోయారు. సినిమా ఎలా ఉంది అని అడగడం మానేసి.. కేతిక సంపేసిందిరా బాబూ.. ఏం గ్లామర్ రా నాయనా అది అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అందుకే ఈ సినిమాకు తొలిరోజు కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి. అయితే రెండో రోజు మాత్రం చాలా చోట్ల రొమాంటిక్ సినిమాకు కలెక్షన్స్ తగ్గిపోయాయి. సినిమాలో విషయం తక్కువ.. రొమాన్స్ ఎక్కువగా ఉండటంతో థియేటర్స్ వరకు వెళ్లడానికి ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాతో పాటే విడుదలైన వరుడు కావలెను సినిమాకు యావరేజ్ టాక్ రావడం.. అది ఫ్యామిలీ సినిమాలా కనిపించడంతో ఆడియన్స్ అటు వైపు వెళ్తున్నారు. ఈ సినిమా కూడా తొలిరోజే 1.50 కోట్లు షేర్ వసూలు చేసింది. రొమాంటిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ చూసి పూరీ జగన్నాథ్ గాల్లో తేలిపోయాడు. ఎందుకంటే ఈ సినిమాకు నిర్మాత ఆయనే కాబట్టి. ఈ సినిమా తొలి రోజు ఏరియా వైజ్ కలెక్షన్స్ ( Romantic movie collections )..
నైజాం: 0.55 కోట్లు
సీడెడ్: 0.27 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.19 కోట్లు
ఈస్ట్: 0.14 కోట్లు
వెస్ట్: 0.12 కోట్లు
గుంటూరు: 0.09 కోట్లు
కృష్ణా: 0.10 కోట్లు
నెల్లూరు: 0.07 కోట్లు
ఏపీ + తెలంగాణ: 1.53 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.08 కోట్లు
వరల్డ్ వైడ్ 6 డేస్ కలెక్షన్స్: 1.61 కోట్లు షేర్
రెండోరోజు కచ్చితంగా తొలిరోజు షేర్ మాత్రం వచ్చేలా కనిపించడం లేదు. చాలా చోట్ల కలెక్షన్ గ్రాఫ్ పడిపోయిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా సిటీస్‌లో కాకుండా జిల్లాల్లో అయితే రొమాంటిక్ వసూళ్లు తక్కువగానే వస్తున్నాయి. మరి వీకెండ్ వరకు ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఇడియట్’లాంటి సినిమా అంటున్నారు!
Charmy Kaur | యాక్టింగ్‌లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
మహా సముద్రం ఫైనల్ కలెక్షన్స్.. శర్వానంద్ కు భారీ డిజాస్టర్..
పునీత్ అంత్యక్రియల విషయంలో కుటుంబ సభ్యుల కీలక నిర్ణయం..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

