Shriya Saran | మా అమ్మాయే స్ఫూర్తి.. ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్న శ్రియ
Shriya Saran : రాశి తగ్గినా వాసి తగ్గని నటి శ్రియ. రియల్ లైఫ్‌లో ఇల్లాలిగా అవతారమెత్తినా, తల్లిగా ప్రమోషన్ వచ్చినా.. రీల్‌లైఫ్‌లో అడపాదడపా మెరుస్తూనే ఉంది. దక్షిణాది చిత్రాలతోపాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తున్నది. తాజాగా ఆమె నటించిన కన్నడ చిత్రం ‘కబ్జా’ విడుదలకు సిద్ధంగా ఉంది.
Shriya Saran : రాశి తగ్గినా వాసి తగ్గని నటి శ్రియ. రియల్ లైఫ్‌లో ఇల్లాలిగా అవతారమెత్తినా, తల్లిగా ప్రమోషన్ వచ్చినా.. రీల్‌లైఫ్‌లో అడపాదడపా మెరుస్తూనే ఉంది. దక్షిణాది చిత్రాలతోపాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తున్నది. తాజాగా ఆమె నటించిన కన్నడ చిత్రం ‘కబ్జా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో శ్రియ మీడియాతో పంచుకున్న కబుర్లు..

మీరు విధిని నమ్ముతారా?
మనకు ఏది రాసిపెట్టి ఉందో అదే జరుగుతుందని బలంగా విశ్వసిస్తా! దేవుణ్ని సంపూర్ణంగా నమ్ముతా. శ్రీకృష్ణ పరమాత్మ నా ఇష్టదైవం. ఆయన సంకల్పం లేనిదే ఏదీ జరగదని అనిపిస్తుంటుంది.
మీరు ఈ విజయాలను ఎలా సాధించారు?
సినిమా పరిశ్రమలో నా ప్రయాణం ఒకరకంగా సాఫీగా సాగిందనే చెబుతాను. ఒడుదొడుకులు అందరికీ వస్తుంటాయి. అందుకు నేను మినహాయింపేం కాదు! కానీ, సవాళ్లు ఎదురైనప్పుడు పట్టుదలతో వాటిని అధిగమించాను. గెలుపోటములు సహజం. అన్నిటినీ సమంగా తీసుకోవాలి! ప్రతి రోజూ కొత్త అవకాశాన్ని కల్పిస్తుంది. దానిని అందిపుచ్చుకోవడం మనచేతుల్లోనే ఉంది.
త్వరలో విడుదల కానున్న ‘కబ్జా’ చిత్రంలో మీ లుక్స్ కట్టిపడేసేలా ఉన్నాయి. ఇంతకీ ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతున్నది?
ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్స్ కిచ్చ సుదీప్, ఉపేంద్రతో కలిసి నటిస్తున్నా. 1947-60 మధ్య కాలంలో ఇద్దరు గ్యాంగ్స్టర్స్ మధ్య వైరం ఈ కథ నేపథ్యం. విభిన్నమైన కథను దర్శకుడు ఆర్.చంద్రు వినూత్నంగా తెరకెక్కించాడు. ఇలాంటి చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉంది. నా కెరీర్లో మరో మంచి సినిమాగా నిలిచిపోతుంది. నా లుక్స్ విషయానికి వస్తే క్రెడిట్ అంతా సినిమాటోగ్రాఫర్ శెట్టీకి దక్కుతుంది. ప్రతి ఫ్రేమ్నూ చాలా అందంగా చిత్రీకరించారు. సినిమాను కెరీర్‌గా ఎంచుకున్నప్పడు.. ఆ విషయాన్ని మీ తల్లిదండ్రులకు చెప్పడానికి ఏమైనా ఇబ్బందిపడ్డారా? అలాంటిదేమీ లేదు! నాకు సినిమా అవకాశం వచ్చినప్పుడు నాన్నే స్క్రీనింగ్ టెస్ట్ కోసం హైదరాబాద్ తీసుకొచ్చారు. అప్పుడే నేను మొదటిసారి విమానం ఎక్కాను. కెరీర్ మొదట్లో అమ్మానాన్న నాకు ఎంతో సపోర్ట్ చేశారు. నా విజయాన్ని తమ విజయంగా సెలబ్రేట్ చేసుకున్నారు. నా ప్రతి మలుపులో వాళ్లున్నారు.
మీకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు ఎవరు?
జీవితంలో ఏదో సాధించిన వ్యక్తులు మాత్రమే స్ఫూర్తి ప్రదాతలు అనుకోవద్దు. మన చుట్టూ ఉంటే సమాజంలో ప్రతీ వ్యక్తి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, స్ఫూర్తి పొందొచ్చు. కష్టపడే తత్వం మా అమ్మనుంచి నేర్చుకున్నా! నా స్నేహితులు, అసిస్టెంట్లు, వర్కర్లు అందరూ నన్ను ఇన్స్పైర్ చేసినవాళ్లే! నా చిట్టితల్లి రాధ (కూతురు) కూడా నాకు స్ఫూర్తినిస్తుంది. కొత్త విషయం నేర్చుకునే క్రమంలో నా బిడ్డ కనబరిచే తపన చూసి ముచ్చటేస్తుంది.
అమ్మదనం మీలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అనుకుంటున్నారు?
రాధ పుట్టాక నేను చాలా మారిపోయానేమో అనిపిస్తుంది. అమ్మదనం గొప్పదనాన్ని ప్రతిక్షణం అనుభవిస్తున్నా. నా చిట్టితల్లి పంచుతున్న ఆనందం ముందు తనకు ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంటుంది. తెల్లవారుతూనే రెండు చిట్టిచేతులు నా ముఖాన్ని తడుముతుంటాయి. కండ్లు తెరిచేసరికి ముసిముసి నవ్వులతో చందమామలా ముందుంటుంది. నా కూతురు నా సంతోషాన్ని పెంచడంతోపాటు నా ఓపికనూ రెట్టింపు చేసింది. తనను చూసినప్పుడల్లా తల్లిగా నా బాధ్యతలు గుర్తొస్తాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

