HEMA | శివగామి లాంటి రోల్ ఇచ్చిన ఇక చేయను.. సినిమాలకి గుడ్ బై చెప్పిన నటి హేమ
HEMA| నటి హేమ మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఒకప్పుడు హేమ అంటే ఆమె న
HEMA| నటి హేమ మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఒకప్పుడు హేమ అంటే ఆమె నటించిన క్యారెక్టర్స్ గుర్తుకు వస్తాయి. ఇప్పుడు అయితే డ్రగ్స్ కేసూ.. ఇతర వివాదాలు.. అవి ఇవీ గుర్తొస్తుంటాయి . హేమ ‘అతడు’ సినిమాలో బ్రహ్మానందంతో కలిసి చేసిన కొన్ని సీన్స్‌కి జనాలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. నటి హేమ ఎన్ని సినిమాలు చేసినా కూడా.. అతడు సినిమా గురించే అడుగుతుంటారు. అయితే అలాంటి పాత్రలు ఎప్పుడుచేస్తారు హేమా గారూ అని అడగగా, అలాంటి పాత్రలు కాదు.. అసలు ఇకపై ఎలాంటి పాత్రలు చేయనంటూ పెద్ద షాక్ ఇచ్చింది నటి హేమ.
నేను 14 ఏళ్ళ వయసు నుంచి కష్టపడుతున్నా. ఇకపై విశ్రాంతి తీసుకుంటూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది . జీవితాంతం కష్టపడుతూనే ఉండాలా, కొంచెం చిల్ అవ్వాలి కదా అందుకే చిల్ అవుతున్నా. సినిమాలకు, నటనకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాను. బాహుబలిలో శివగామి లాంటి పాత్ర ఇచ్చినా చేయను అని హేమ తేల్చి చెప్పింది. ఒకవేళ మళ్ళీ నాకు నటనపై ఆసక్తి కలిగితే అప్పుడు ఆలోచిస్తానంటూ హేమ స్పష్టం చేసింది. ఇప్పుడు హేమ ఎంజాయ్ చేయాలనే మూడ్‌లో ఉంది. ఆ కారణంగానే సినిమాలకి దూరం అవ్వాలని డిసైడ్ అయింది.
అయితే హేమ ఎంజాయ్మెంట్ కోసమే సినిమాలు మానేస్తుందా, లేకుంటే వేరే కారణం ఏదైన ఉందా అనే దాని గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది. వివాదాల వలన దూరం అవుతుందేమో అని కొందరు ముచ్చటించుకుంటున్నారు. డ్రగ్స్ కేసు ఇష్యూ తరువాత నటి హేమ మీడియాకి కాస్త దూరంగానే ఉంటున్నారు. నటి హేమ.. ఇప్పటివరకూ తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో కలిపి దాదాపు 500పైగా చిత్రాల్లో నటించింది. హేమ అసలు పేరు కృష్ణవేణి కాగా, ఈమెది అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చిన హేమ.. సీరియల్స్‌లో కూడా నటించింది. 1989లో ‘చిన్నారి స్నేహం’ సినిమాలో చిన్న పాత్రలో నటించిన ఆమె చివరిగా 2023లో వచ్చిన ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ సినిమాలో కనిపించింది. అతడు, దేశముదురు, పెళ్లైన కొత్తలో, శ్రీరామదాసు, భగీరథ, మల్లీశ్వరి లాంటి చిత్రాలు హేమకి మంచి పేరు తీసుకురావడమే కాక జనాలకి దగ్గర చేశాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

