కిచ్చా సుదీప్, అమలా పాల్ జంటగా నటించిన చిత్రం ‘హెబ్బులి’. కన్నడలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ చిత్రాన్ని సీఎంబీ ప్రొడక్షన్స్‌పై ఎం. మోహన శివకుమార్ సమర్పణలో సి.సుబ్రహ్మణ్యం నిర్మించారు. ఎస్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ నెల 25న విడుదల కానున్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ…“విక్రాంత్ రోణ’ వంటి సక్సెస్ తర్వాత కిచ్చా సుదీప్ నటించిన చిత్రమిది. యాక్షన్, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ వంటి అంశాలు ఆకట్టుకుంటాయి. కన్నడలో మంచి విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుందని ఆశిస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో వి. రవిచంద్రన్, పి. రవిశంకర్, కబీర్ దుహాన్ సింగ్,
రవికిషన్ కనిపించనున్నారు.