సినిమా ప్రమోషన్లో భాగంగా అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వడం కథానాయికలకు పరిపాటే. ఆ సందర్భాల్లో మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్నలు ఒక్కోసారి ఇరకాటంలో పడేస్తుంటాయి. కొందరు హీరోయిన్లు తెలివిగా సమాధానాలిచ్చేసి తప్పించుకుంటూవుంటారు, కొందరు హీరోయిన్లు మాత్రం సూటిగా సమాధానాలిచ్చేస్తుంటారు.
పాయల్ రాజ్పుత్ రెండో టైపు. రీసెంట్గా తన సినిమా ప్రమోషన్లో భాగం ఆమెకు మీడియా నుంచి అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది. చదువుకునే రోజుల్లో కానీ, చిత్ర పరిశ్రమలోకానీ మీకు క్రష్ ఎవరైనా ఉన్నారా? అనేది ప్రశ్న. దీనికి పాయల్ తడుముకోకుండా సమాధానమిచ్చేసింది.
‘స్కూల్ డేస్లో ఓ అబ్బాయిని ఇష్టపడ్డాను. తను కనిపిస్తే చాలు గుండెల్లో బరువుగా ఉండేది. తెలీని బాధ. ఓసారి నేరుగా ప్రపోజ్ చేశాను. తను నిర్మొహమాటంగా రిజెక్ట్ చేశాడు. అప్పుడు నా బాధ వర్ణనాతీతం. తిండి కూడా సహించేదికాదు. అమ్మకు చెప్పి వెక్కివెక్కి ఏడ్చాను. ఆ బాధతోనే ఎగ్జామ్లో కూడా ఫెయిల్ అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చింది పాయల్.