నా కెరీర్లో గేమ్ ఛేంజర్ అవుతుంది
సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్ దర్శకత్వంలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. మాళవిక శర్మ కథానాయిక. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నది.
సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్ దర్శకత్వంలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. మాళవిక శర్మ కథానాయిక. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. ఈ సందర్భంగా సోమవారం టీజర్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు. హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు ఈ సినిమాను తెరకెక్కించారు.
దర్శకుడు నన్ను కొత్తగా ప్రజెంట్ చేశాడు. టీజర్లో నా లుక్ అదిరిపోయిందని అందరూ అంటున్నారు. అన్ని కమర్షియల్ అంశాలతో పాటు ఎమోషన్స్ కలబోసిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమా నా కెరీర్లో గేమ్ ఛేంజర్ అవుతుందని బలంగా విశ్వసిస్తున్నా’ అన్నారు. దేశవ్యాప్తంగా టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నదని, చేతన్ భరద్వాజ్ సంగీతం మరో స్థాయికి తీసుకెళ్లిందని దర్శకుడు జ్ఞానసాగర్ తెలిపారు. టీజర్‌కు వస్తున్న స్పందన సంతోషాన్నిస్తున్నదని, నిర్మాతగా తన తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించాలని నిర్మాత సుమంత్ జి నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

