ఎన్టీఆర్, ఏఎన్నార్ చేయాల్సిన పాత్ర ఇది
“హరికథ’ సిరీస్ చూశాక, ‘సినిమాగా ఎందుకు తీయలేదు?’ అనడుగుతారు. స్ట్రాంగ్ కంటెంట్‌తో రూపొందిన సినిమా ఇది. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి మహానటులు చేయాల్సిన పాత్ర నాకు దక్కడం నా అదృష్టం. హరికథలు చెబుతూ బతికే గంగాచారిగా ఇందులో కనిపిస్తా. ప్యాషన్‌తో తీసిన సిరీస్ ఇది.
“హరికథ’ సిరీస్ చూశాక, ‘సినిమాగా ఎందుకు తీయలేదు?’ అనడుగుతారు. స్ట్రాంగ్ కంటెంట్‌తో రూపొందిన సినిమా ఇది. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి మహానటులు చేయాల్సిన పాత్ర నాకు దక్కడం నా అదృష్టం. హరికథలు చెబుతూ బతికే గంగాచారిగా ఇందులో కనిపిస్తా. ప్యాషన్‌తో తీసిన సిరీస్ ఇది. అందరూ కచ్చితంగా ఇష్టపడతారు.’ అని డా.రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆయన ప్రధాన పాత్రగా రూపొందిన వెబ్‌సిరీస్ ‘హరికథ’. మ్యాగీ దర్శకుడు. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సిరీస్ ఈ నెల 13 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. వైవిధ్యమైన చాలా పెద్ద స్క్రిప్ట్ ఇదని, యూనిట్‌లోని ప్రతిఒక్కరి సహకారం వల్లే ఈ సిరీస్ చేయగలిగానని, ముఖ్యంగా టీజీ విశ్వప్రసాద్ లాంటి ప్రొడ్యూసర్ దక్కడం తమ అదృష్టమని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు. దివి, పూజిత పొన్నాడ, శ్రీరామ్, మౌనికరెడ్డి, అర్జున్ అంబటి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ వెబ్‌సిరీస్‌కి కెమెరా: విజయ్ ఉళగనాథ్, సంగీతం: సురేశ్ బొబ్బిలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

