Hari Hara Veera Mallu | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఏపీలో ఎన్నికల పోరుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల కంటే ముందు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడు పవన్. ఇందులో ఒకటి హరిహర వీరమల్లు ( Hari Hara Veera Mallu). జాగర్లమూడి క్రిష్ణ (క్రిష్) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల అనంతరం మళ్లీ షూటింగ్లో జాయిన్ కానున్నాడు పవన్. అయితే చాలా రోజుల తర్వాత ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
నేడు శ్రీరామ నవమి. ఈ సందర్భంగా టాలీవుడ్ నుంచి కొత్త అప్డేట్లు వస్తుండగా.. హరిహర వీరమల్లు టీం కూడా కొత్త పోస్టర్ను పంచుకుంది. జై శ్రీరామ్… శ్రీరామనవమి శుభాకాంక్షలతో మీ ముందుకు… ‘ధర్మం కోసం యుధ్ధం‘ త్వరలో! అంటూ చిత్రయూనిట్ రాసుకోచ్చింది.
జై శ్రీరామ్… శ్రీరామనవమి శుభాకాంక్షలతో… 🏹
మీ ముందుకు… ‘ధర్మం కోసం యుధ్ధం‘ త్వరలో! #HariHaraVeeraMallu Teaser Out Soon! 🔥@PawanKalyan @DirKrish @thedeol @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @rathinamkrish @gnanashekarvs @cinemainmygenes… pic.twitter.com/eN7CmdIgso
— Telugu FilmNagar (@telugufilmnagar) April 17, 2024
పవన్ కల్యాణ్ కెరీర్లోనే తొలిసారి పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో నటిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుందని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.