Pawan Kalyan | ఇక హరిహర వీరమల్లు వంతు.. త్వరలో స్పెషల్ ప్రోమో
‘హరిహర వీరమల్లు’ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం పవన్‌కల్యాణ్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వారి కోసం నిర్మాణ సంస్థ ఓ గుడ్‌న్యూస్‌ను పంచుకుంది.
Pawan Kalyan | ‘హరిహర వీరమల్లు’ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం పవన్‌కల్యాణ్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వారి కోసం నిర్మాణ సంస్థ ఓ గుడ్‌న్యూస్‌ను పంచుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతున్నదని, త్వరలో స్పెషల్ ప్రోమోను విడుదల చేస్తామని ప్రకటించింది. ‘ప్రస్తుతం ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో గ్రాఫిక్స్ వర్క్స్ జరుపుతున్నాం. అందరి అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుంది. నిర్మాణ విలువలు మరో స్థాయిలో ఉంటాయి’ అని చిత్ర బృందం ప్రకటనలో పేర్కొంది.
క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం.రత్నం సమర్పణలో దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. పదిహేడవ శతాబ్దానికి చెందిన మొఘలాయిలు, కుతుబ్‌షాహీల శకం నేపథ్యంలో జరిగే కథ ఇది. ఇందులో అన్యాయాలపై పోరాటం చేసే బందిపోటు వీరమల్లు పాత్రలో కనిపించనున్నారు పవన్‌కల్యాణ్. పాన్ ఇండియా స్థాయిలో రానున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు. ఇటీవల పవన్‌కల్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ నుంచి వచ్చిన కొత్త పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ‘హరిహరవీరమల్లు’ తాజా అప్డేట్తో అభిమానులు మరింత హ్యాఫీగా ఫీలవుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

