Hanuman | తేజ సజ్జ ‘హనుమాన్’ ట్రైలర్ లోడింగ్..!
Hanuman Trailer | దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) తెరకెక్కించే సినిమాలు ఎంత క్రియేటివ్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అ!, కల్కి, జాంబీ రెడ్డి చిత్రాలు వేటికవి ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ మూడు చిత్రాలు విభిన్నమైన జానర్స్‌లో తెరకెక్కి మంచి విజయాన్ని సాధించాయి.
Hanuman Trailer | దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) తెరకెక్కించే సినిమాలు ఎంత క్రియేటివ్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అ!, కల్కి, జాంబీ రెడ్డి చిత్రాలు వేటికవి ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ మూడు చిత్రాలు విభిన్నమైన జానర్స్‌లో తెరకెక్కి మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు హనుమాన్ (Hanuman) అంటూ తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్ తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ వర్మ. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుండగా, ఇందులో జాంబి రెడ్డి కథానాయకుడు తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. ఇక సూపర్ హీరో సిరీస్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఈ టీజర్ హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. యూనివర్సల్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే హై టెక్నికల్ వాల్యూస్‌తో కట్ చేసిన విజువల్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.
కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు మేకర్స్. దసరా పండుగ కానుకగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల చేసిన చిత్రబృందం దానితో పాటు ట్రైలర్ అప్డేట్ ఇచ్చింది. హనుమాన్ ట్రైలర్ లోడ్ అవుతున్నట్లు త్వరలోనే వస్తుందని మేకర్స్ ప్రకటించారు.
Trailer Soon💥#HanuManOnJan12th@tejasajja123@Actor_Amritha @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets pic.twitter.com/fEhFv3uQDK
— Prasanth Varma (@PrasanthVarma) October 24, 2023
ఇక ఈ చిత్రాన్ని 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, వెంకట్ కుమార్ జెట్టీ లైన్ ప్రొడ్యూసర్‌గా, కుశాల్ రెడ్డి అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. హనుమాన్ చిత్రానికి గౌరహరి-అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

