ఆవకాయ.. ఆంజనేయ..
‘ఆపద వస్తే ఆంజనేయస్వామి.. ఆకలేస్తే ఆవకాయ.. ఇది మన కల్చర్‌లో బలంగా నాటుకుపోయింది.. ఇదొక ఎమోషన్. అలాంటి కల్చర్‌ని కమర్షియల్ వేలో అద్భుతంగా చూపించాడు ప్రశాంత్. దీనికి గ్రేట్ ట్యూన్ ఇచ్చిన అనుదీప్‌కీ, మంచి సాహిత్యం అందించిన సింహాకీ, అద్భుతంగా పాడిన సాహితికి, ఇతర భాషల్లో పాడిన సింగర్స్‌కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
‘ఆపద వస్తే ఆంజనేయస్వామి.. ఆకలేస్తే ఆవకాయ.. ఇది మన కల్చర్‌లో బలంగా నాటుకుపోయింది.. ఇదొక ఎమోషన్. అలాంటి కల్చర్‌ని కమర్షియల్ వేలో అద్భుతంగా చూపించాడు ప్రశాంత్. దీనికి గ్రేట్ ట్యూన్ ఇచ్చిన అనుదీప్‌కీ, మంచి సాహిత్యం అందించిన సింహాకీ, అద్భుతంగా పాడిన సాహితికి, ఇతర భాషల్లో పాడిన సింగర్స్‌కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అద్భుతమైన ఆలోచనని అంతే అద్భుతంగా విజువలైజ్ చేసిన ప్రశాంత్‌కి ధన్యవాదాలు. వచ్చే సంక్రాంతి ‘హను-మాన్’తో థియేటర్లలో పండగ చేసుకుందాం’ అని యువహీరో తేజా సజ్జ అన్నారు. ఆయన కథానాయకుడిగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హను-మాన్’. కె.నిరంజన్‌రెడ్డి నిర్మాత. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమాకు చెందిన ‘ఆవకాయ ఆంజనేయ..’ పాటను బుధవారం మేకర్స్ విడుదల చేశారు. ‘ఈ సినిమాలో ‘ఆవకాయ.. ఆంజనేయ’ పాట చాలా ప్రత్యేకం. టీజర్‌తో సినిమాపై చాలామంచి హైప్ వచ్చింది. సినిమా నేపథ్యంపై చాలామందికి చాలా అనుమానాలున్నాయి. అన్నింటినీ రానున్న ప్రమోషన్ మెటీరియల్స్ ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తాం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లదాకా అందరూ చూడదగ్గ సినిమా ఇది. సాంకేతికంగా అబ్బురపరిచేలా ఉంటుందీ సినిమా’ అని దర్శకుడు ప్రశాంత్‌వర్మ చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులంతా మాట్లాడారు. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్‌రాయ్, సత్య, గెటప్ శ్రీను, రాజ్ దీపక్ శెట్టి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

