Hanuman Movie | ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన హనుమాన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
Hanuman Movie | టాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ హనుమాన్ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. స్టార్ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తేజ సజ్జా(Teja Sajja) కథా నాయకుడిగా నటించాడు. జనవరి 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
Hanuman Movie | టాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ హనుమాన్ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. స్టార్ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తేజ సజ్జా(Teja Sajja) కథా నాయకుడిగా నటించాడు. జనవరి 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పటివరకు సుమారు రూ.300 కోట్లకు పైగా వసూళ్ళను రాబట్టింది. అయితే థియేటర్లో విడుదలై రెండు నెలలకు పైగా అయిన ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. ఇక ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు తీపి కబురు అందిస్తూ.. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ తదితర భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్స్ వేదికగా ప్రకటించాడు.
HanuMan is now streaming on @ZEE5Telugu 😊@tejasajja123 @Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Chaitanyaniran @AsrinReddy @Primeshowtweets @tipsofficial @tipsmusicsouth @ThePVCU @RKDStudios #HanuMan #HanuManOnZEE5 pic.twitter.com/PLf0lF3Lfw
— Prasanth Varma (@PrasanthVarma) March 17, 2024
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అది అంజనాద్రి అనే ఊహ ప్రాంతం. ఆ వూర్లో హనుమంతు (తేజాసజ్జా) ఒక మామూలు కుర్రాడు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ సరదాగా కాలం గడిపేస్తుంటాడు. అనుకోని సంఘటనతో హనుమంతుకి కొన్ని అతీత శక్తులు వస్తాయి. ఆ శక్తుల గురించి తెలుసుకున్న మైఖెల్ (వినయ్‌రాయ్) అంజనాద్రి వస్తాడు. హనుమంతు వద్ద శక్తులని తన వశం చేసుకొని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడు కావాలనుకుంటాడు. మరా ఆ శక్తిని వశం చేసుకోవడానికి మైఖెల్ ఏం చేశాడు? మైఖేల్ వలన అంజనాద్రికి ఎలాంటి ముప్పు వాటిల్లింది ? హనుమంతు మైఖేల్ ని ఎలా అడ్డురుకున్నాడు ? అనేది తెరపై చూడాలి.
ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా జై హనుమాన్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ‘రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?’ అన్న స్టోరీతో హనుమాన్’ సీక్వెల్ రాబోతుండగా.. ఈ సినిమాలో హనుమంతుడిగా కనిపించబోయేది ఎవరంటూ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

