Adipurush writer : ఆదిపురుష్ సినిమాపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో ఈ సినిమాను బ్యాన్ చేయాలని ఆందోళనలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వాలు సినిమాపై నిషేధం విధించాయి. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ సినిమా సినిమా డైలాగ్ రైటర్, లిరిసిస్ట్ మనోజ్ ముంతాషిర్ శుక్లా మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు.
హనుమంతుడు భగవంతుడే కాదని అన్నాడు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘హనుమంతుడు భగవంతుడు కాదు. ఆయనొక భక్తుడు. ఆయన భక్తిలో ఉన్న శక్తి కారణంగా ఆయనను మనమే భగవంతుడిని చేశాం’ అని వ్యాఖ్యానించారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. జనాన్ని అనవసరంగా రెచ్చగొట్టకుండా నోరు మూసుకుని ఉండాలని హెచ్చరిస్తున్నారు.
‘మీరు నోరు మూసుకోండి. ఎందుకు జనాన్ని అనవసరంగా రెచ్చగొడుతున్నారు..?’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ఈయన చేసేవన్నీ పనికిరాని వాదనలే’ అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. ‘హనుమంతుడు దేవుడే. ఆయన సాక్షాత్తు పరమ శివుడి అవతారం’ అని ఇంకో నెటిజన్ మండిపడ్డాడు.
“बजरंग बली भगवान नहीं हैं भक्त हैं हमने उनको भगवान बनाया बाद में” –@manojmuntashir
तुम मूर्ख हो मनोज, मौन हो जाओ अभी भी समय है। pic.twitter.com/PSqLXpJ04q
— BALA (@erbmjha) June 19, 2023