Hansika Motwani | బాలీవుడ్ బొద్దుగుమ్మ హన్సిక గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.ఈ నెల మొదటి వారంలో తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పింది. తన స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన సోహెల్ కతూరియాతో ఏడడుగులు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కాగా, పెళ్లైన తర్వాత హన్సిక తన కుకింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ కొత్త పెళ్లి కూతురు.. పెహ్లీ రసోయ్ (హల్వా)ని తయారు చేసింది. ఈ విషయాన్ని తన భర్త సోహెల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను సైతం పోస్టు చేశాడు. ఫొటోలో హన్సిక తాను ప్రిపేర్ చేసిన హల్వాను సర్వ్ చేస్తూ కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘ఇవే గృహిణి లక్షణాలు..’, ‘సూపర్ హన్సిక..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
హన్సిక మోత్వానీ వివాహం వ్యాపారవేత్త సొహైల్ కతూరియాతో ఈ నెల 5వ తేదీ(ఆదివారం) రాత్రి ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ జైపూర్‌లోని ఓ కోటలో సింధీ సంప్రదాయం ప్రకారం వీరు వివాహం చేసుకున్నారు. పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సైతం హన్సిక సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.