Bimbisara Movie | ‘బింబిసార’ స్పెషల్ సాంగ్ విడుదల..!
Bimbisara Special Song | ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ‘బింబిసార’ హవా నడుస్తుంది. ‘పటాస్’ తర్వాత దాదాపు ఏడేళ్ళకు కళ్యాణ్‌రామ్ ఈ చిత్రంతో కమర్షియల్ హిట్‌ను సాధించాడు. ఈయన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా బింబిసార నిలిచింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దర్శకుడు మల్లిడి వశిష్ఠ డెబ్యూ సినిమానే అయినా.. తన టేకింగ్‌కు, పాత్రలను మలిచిన విధానంకు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ఈ సినిమా విజయంలో సగం వరకు క్రెడిట్ కీరవాణికే దక్కుతుంది. ఈ మూవీలోని పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను సీట్లలో కూర్చోనీయకుండా చేశాయి. కాగా తాజాగా ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ సినిమాలోని ‘బింబిసార’ అంటూ సాగే ఐటెం గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రీ రచించిన ఈ పాటను చిన్మయి శ్రీపద ఆలపించింది. ఈ సాంగ్‌లో సెట్టింగ్, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక బింబిసారుడి కలెక్షన్ల యాత్ర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ చిత్రానికి దాదాపు పది కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. ఇలానే కంటిన్యూ అయితే ఈ ఏడాది డబుల్ బ్లాక్ బస్టర్ చిత్రాలలో బింబిసార కూడా చేరుతుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌కు జోడీగా కేథరీన్ ట్రెసా, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

