అక్కినేని నాగార్జునకు ఈ మధ్య సక్సెస్ అనేది లేదు. మన్మథుడు 2 చిత్రం తర్వాత వైల్డ్ డాగ్ సినిమా చేశాడు నాగ్. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నాడు. అయితే వైల్డ్ డాగ్ చిత్రంతో హాట్ బ్యూటీ దియా మీర్జాను టాలీవుడ్‌కి తీసుకు వచ్చాడు నాగ్.
ఇక ఇప్పుడు గుల్ పనాగ్ని తీసుకురానున్నారట. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సెకండ్ షెడ్యూల్ ఇటీవల మొదలు పెట్టారు నాగ్. ఈ సినిమాలో నాగార్జున రా ఏజెంట్ గా కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఇటీవల నాగార్జున లుక్ విడుదల చేయగా, లుక్ షాకింగ్ గా ఉంది. వైల్డ్ డాగ్ సినిమాలో కనిపించిన దాని కంటే కూడా మరింత యంగ్ గా నాగార్జున కనిపిస్తున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తుంది.
చిత్రంలో మరో హీరోయిన్గా గుల్ పనాగ్ ను ఎంపిక చేశారట. ఆమె తో నాగార్జున రొమాన్స్ ఉంటుందా లేదంటే ఆమె రా ఏజెంట్ టీమ్ మెంబర్ గా కనిపించబోతుందా అనేది తెలియాల్సి ఉంది. గతంలో బాలీవుడ్ లో పలు సినిమాలు చేసి.. వెబ్ సిరీస్ ల్లో నటించి మెప్పించిన గుల్ పనాగ్ ఈ సినిమా లో నటించడం వల్ల అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా తర్వాత నాగార్జున బంగార్రాజు సినిమా చేయనున్నాడు.