సురేశ్, రాకేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కొత్త సినిమా’. అజర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ‘మేము కూడా సినిమా తీసినామురో..’ అనే పాటను బుధవారం విడుదల చేశారు. చరణ్‌అర్జున్ ఈ గీతాన్ని రచించారు. హైదరాబాద్ వచ్చి తమ సినిమా కలను నెరవేర్చుకోలేని ఎంతోమంది ఔత్సాహికుల ఆవేదన ఈ పాటలో ఉంటుందని ఆయన తెలిపారు.
దర్శకుడు అజర్ మాట్లాడుతూ ‘మేమంతా బొగ్గు నుంచి వెలుగులు పంచే రామగుండం ప్రాంతం నుంచి వచ్చినవాళ్లం. ఈ సినిమా ద్వారా వందమంది కొత్తవాళ్లను పరిచయం చేస్తున్నాం. ఊరిలోనే ఉంటూ ఊరివాళ్లతోనే సినిమా తీయొచ్చని ఈ ప్రాజెక్ట్‌తో నిరూపించాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జానీ బాషా, నిర్మాతలు: మహమ్మద్ వసీమ్ అక్రమ్, సాగి సుధీర్‌రావు, యడండ్ల సతీష్ యాదవ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, ఎడిటింగ్, దర్శకత్వం: అజర్.